పొట్టి మిడ్డీలో ఖుషీ కపూర్ మైండ్ బ్లాక్ ఫోజులు!
వాలు చూపులతో మతులు చెడగొడుతోంది.. ఒంపుసొంపులతో గుబులు పెంచుతోంది..! నటవారసురాలు ఖుషీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
By: Sivaji Kontham | 10 May 2026 10:17 AM ISTవాలు చూపులతో మతులు చెడగొడుతోంది.. ఒంపుసొంపులతో గుబులు పెంచుతోంది..! నటవారసురాలు ఖుషీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. రెగ్యులర్ ఫోటోషూట్లలో స్ట్రైకింగ్ ఫోజులతో మతులు చెడగొడుతున్న ఈ అమ్మడు.. తన అక్క జాన్వీ కపూర్‌కే గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఖుషీ ఒక అదిరిపోయే ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. ఐదున్నర అడుగుల ఎత్తు.. కర్వీ సొగసులతో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ భామ పొట్టి మిడ్డీలో తన పొడవాటి కాళ్ళ సౌందర్యాన్ని .. థై సొగసులను ఎలివేట్ చేస్తూ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
నేటి జెన్ జెడ్ యువతలో ఖుషీ కపూర్ డ్యాషింగ్ స్టైల్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. శ్రీదేవి చిన్న కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన `గ్లామర్ ఐకాన్` ఇమేజ్‌ను సంపాదించుకుంది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా.. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ ప్రయాణాన్ని పక్కా ప్లానింగ్‌తో సాగిస్తోంది. 2020లో `స్పీక్ అప్` అనే లఘు చిత్రంతో ప్రారంభమైన ఖుషీ ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్ లో కెరీర్ జర్నీకి సహకరిస్తోంది. ఆరంభం కొన్ని శకునములు కలిసి రాకపోయినా.. భవిష్యత్ లో ఎలా ఉండాలో ఎలాంటి ఎంపికలతో ముందుకు సాగాలో ఇప్పటికే నేర్చుకుంది.
ఖుషీ కపూర్ 2023లో జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం `ది ఆర్చీస్`తో కెరీర్ ప్రారంభించింది. ఇందులో బెట్టీ కూపర్ పాత్రలో కనబరిచిన నటన- స్క్రీన్ ప్రెజెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఒక స్టార్ కిడ్‌గా భారీ అంచనాల మధ్య డిజిటల్ అరంగేట్రం చేసిన ఖుషీ.. తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. కేవలం వెండితెరపైనే కాకుండా `ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్` వంటి పాపులర్ షోలలో కూడా మెరిసి ప్రేక్షకులకు చేరువయ్యింది.
2025 ఖుషీ కెరీర్ కి ఆశించిన గుర్తింపును ఇవ్వలేదు. జునైద్ ఖాన్ సరసన లవ్ యాపా, ఇబ్రహీం అలీ ఖాన్ సరసన `నాదానియాన్` చిత్రాలు బిగ్ ప్లాపులయ్యాయి. ఈ రెండు సినిమాలపై తానొకటి ఊహిస్తే ఫలితం వేరొకలా వచ్చింది. అయినా నిరాశ చెందక ఖుషీ తనవంతు ప్రయత్నాల్లో ఉంది. తన తల్లి శ్రీదేవి నటించిన క్లాసిక్ `మామ్`కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న `మామ్ 2`లో కీర్తి పాత్రలో ఖుషీ కనిపించనుంది.
వారసత్వంతో పాటు సొంత ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగుతున్న ఖుషీ.. గ్లామర్- అభినయం రెండింటినీ సమపాళ్ళలో బ్యాలెన్స్ చేస్తోంది. తాజా ఫోటో షూట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న ఈ బ్యూటీ భవిష్యత్తులో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీదేవి వారసురాలిగా అంచనాలను అందుకుంటూనే తనదైన శైలిలో నవతరం ప్రేక్షకులను అలరిస్తున్న ఖుషీ కపూర్ ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది.
