సెల్ఫీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ఖుషీ కపూర్!
సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత హీరోయిన్లు, సెలబ్రిటీల వారసులు ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు షేర్ చేస్తూ పాపులారిటీ అవుతున్నారు.
By: Madhu Reddy | 13 Oct 2025 6:30 PM ISTసోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత హీరోయిన్లు, సెలబ్రిటీల వారసులు ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు షేర్ చేస్తూ పాపులారిటీ అవుతున్నారు. అటు సినిమాల ద్వారా ఇటు పలు ప్రకటనల ద్వారా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు సోషల్ మీడియా అతిపెద్ద వేదికగా అవతరించింది. అందుకే సమయం, సందర్భం లేకపోయినా తమ గ్లామర్ ను వలకబోస్తూ.. ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరో స్టార్ కిడ్ కూడా తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఎవరో కాదు అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చే ఈ చిన్నది తాజాగా సెల్ఫీ ఫోజులతో అభిమానులను ఆకట్టుకుంది. ముత్యాలతో డిజైన్ చేసిన లైట్ పింక్ నెట్టెడ్ శారీ ధరించిన ఈమె అందాలు చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఖుషీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఖుషీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలకు ఈమె సోదరీ ప్రముఖ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ లైక్ చేసింది. అలాగే అభిమానులు, ఫాలోవర్స్, స్టార్ సెలబ్రిటీలు కూడా లైక్ షేర్ చేస్తూ ఖుషీ కపూర్ పాపులారిటీకి దోహదపడుతున్నారు. ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. 2000 సంవత్సరం నవంబర్ 5న మహారాష్ట్రలోని ముంబైలో శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించింది. ఈమె ముంబైలోనే ధీరుబాయ్ అంబానీ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇక నటనలో శిక్షణ తీసుకోవడానికి లండన్ వెళ్లిన ఈమె.. అక్కడే ఫిలిం స్కూల్లో చేరి నటనలో శిక్షణ తీసుకుంది.
ప్రసిద్ధ ఆర్చీస్ కామిక్స్ సిరీస్ ఆధారంగా 2023లో వచ్చిన ది ఆర్చీస్ సినిమాలో సుహానా ఖాన్, రోహిత్ చెత్రీ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. 2020లో వచ్చిన స్పీక్ అప్ అనే షార్ట్ ఫిలిం ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఈ ఏడాది లవ్ యాపా, నదానియన్ వంటి చిత్రాలలో నటించింది. అక్క జాన్వీ కపూర్ లాగే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తోంది ఖుషీ కపూర్.
జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ తెలుగు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో పెద్ది సినిమాతో పాటు ది పారడైజ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా అవకాశం లభించినట్లు తెలుస్తోంది.
