Begin typing your search above and press return to search.

మోచి, లూనా.. క‌పూర్ గాళ్ కొత్త ఫ్రెండ్స్ ఎవ‌ర‌బ్బా?

హిందీ చిత్ర‌సీమ‌లో క‌పూర్ గాళ్స్ హంగామా గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. జాన్వీ క‌పూర్ నిరంత‌రం ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిలుస్తోంది.

By:  Sivaji Kontham   |   9 Oct 2026 4:00 PM IST
మోచి, లూనా.. క‌పూర్ గాళ్ కొత్త ఫ్రెండ్స్ ఎవ‌ర‌బ్బా?
X

హిందీ చిత్ర‌సీమ‌లో క‌పూర్ గాళ్స్ హంగామా గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. జాన్వీ క‌పూర్ నిరంత‌రం ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిలుస్తోంది. అయితే త‌న సోద‌రి ఖుషీ రూట్ వేరుగా ఉంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తున్నా కెరీర్ ప‌రంగా ఎందుక‌నో వెన‌క‌బ‌డింది.





తాజాగా ఈ బ్యూటీ తన పెంపుడు జంతువులు మోచి , లూనాలతో కలిసి దిగిన కొన్ని క్యూట్ అండ్ స్టైలిష్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్ట్‌లో ఖుషీ ధరించిన ఎర్రని దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందాల ఖుషీ గ్లామరస్ లుక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. `ఫేస్ కార్డ్ నెవర్ డిక్లైన్స్` అంటూ త‌న అందాన్ని, హెయిర్ స్టైల్‌ను కొనియాడుతున్నారు. రెడ్ డ్రెస్‌లో ఈ బ్యూటీ ఏఐ (AI) క్రియేటెడ్ బొమ్మలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.





ఇక ఈ పోస్ట్‌పై టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు కూడా స్పందించడం విశేషం. ఖుషీ సోదరి, స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ``కానీ లూనా చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది, ఐ లవ్ ఇట్!!`` అంటూ తన ప్రేమను చాటుకున్నారు. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీ సరదాగా ``సారీ, ఏ డిన్నర్??`` అంటూ కామెంట్ చేయగా పలువురు సెలబ్రిటీలు హార్ట్ ఎమోజీలతో తమ స్పందనలను తెలియజేశారు.





ఖుషీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. డెబ్యూ మూవీ `ది ఆర్చీస్` తర్వాత త‌ను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. న‌టిగా కెరీర్‌కు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. తన సోదరి జాన్వీ కపూర్ చూపించినంతటి ప్రభావాన్ని తొలిరోజుల్లో చూపించలేకపోయినా.. ఖుషీ తన ఇత‌ర అసైన్ మెంట్ల‌తో దూసుకుపోతోంది. 2026లో ప‌లు చిత్రాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్‌ను గడుపుతున్నారు.





సినిమాలతో పాటు సోషల్ మీడియా ఆదాయంలోను, ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల రెవెన్యూ పరంగానూ ఖుషీ కపూర్ దూసుకుపోతున్నారు. ఆన్‌లైన్‌లో ఖుషీ కపూర్ చేసే ప్రతి పోస్ట్ మిలియన్ల కొద్ది వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. ఇలా వ్యక్తిగత జీవిత విశేషాలను, పెట్ డాగ్స్‌తో అల్లరి క్షణాలను షేర్ చేస్తూనే.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ రాణించాల‌ని తపిస్తున్న ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో భారీ అభిమానం సంపాదించుకుంటున్నారు. ఖుషి త‌న స్నేహితుల‌తో క‌లిసి అల్ల‌ర‌ల్ల‌రి చేసిన ఫోటోగ్రాప్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.