పింక్ కార్సెట్ గౌనులో ఖుషీ కపూర్.. ఫేరీ ప్రిన్సెస్ లుక్‌తో రచ్చ!
మోడ్రన్ పింక్ గౌనులో దేవకన్యలా మెరిసిపోతూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
By: Madhu Reddy | 23 Sept 2026 5:36 PM ISTదివంగత లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ల చిన్న కుమార్తె, యంగ్ బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తాజాగా షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. మోడ్రన్ పింక్ గౌనులో దేవకన్యలా మెరిసిపోతూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అక్క జాన్వీ కపూర్ బాటలోనే గ్లామరస్ లుక్స్‌తో అలరిస్తున్న ఈ చిన్నది, తాజాగా పంచుకున్న లగ్జరీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి ఫ్యాన్స్ మనసులను దోచేస్తున్నాయి..
మనీష్ మల్హోత్రా గౌనులో ఫేరీ ప్రిన్సెస్ వైబ్స్:
తాజా ఫోటోషూట్ కోసం ఖుషీ కపూర్ ప్రసిద్ధ డిజైనర్ 'మనీష్ మల్హోత్రా' కౌచర్ లైన్‌కు చెందిన 'సాఫ్ట్ పింక్ టెక్స్చర్డ్ కార్సెట్ గౌన్'ను ఎంచుకుంది. ఇక స్ట్రక్చర్డ్ కార్సెట్ బోడిస్, ఫ్లోరింగ్ డ్రేప్స్‌తో ఉన్న ఈ అవుట్‌ఫిట్ ఆమెకు కంటెంపరరీ ఫేరీ-ప్రిన్సెస్ లుక్‌ని తెచ్చిపెట్టింది. పింక్ షేడ్‌లో ఎంతో క్లాసీగా ఉన్న ఈ డ్రెస్‌లో ఖుషీ ఎంతో గ్లామరస్‌గా మెరిసిపోయింది.
'ఫేరీ ప్రిన్సెస్ డ్రీమ్స్' అంటూ క్యూట్ క్యాప్షన్:
ఈ లగ్జరీ పిక్స్ షేర్ చేస్తూ ఖుషీ కపూర్ "నాకిష్టమైన గౌనులో ఫేరీ ప్రిన్సెస్ డ్రీమ్స్‌ను ఆస్వాదిస్తున్నా " అంటూ స్పెషల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవ్వగా, అభిమానులు "సో ప్రెట్టీ ఖుషీ", "గోర్జియస్ లుక్", "అచ్చం దేవకన్యలా ఉన్నావ్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ లైకులతో ముంచెత్తుతున్నారు.
'ది ఆర్చీస్' నుంచి కెరీర్ ప్రారంభం :
జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన 'ది ఆర్చీస్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఖుషీ కపూర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్‌తో 'నాదానియాన్', జునైద్ ఖాన్‌తో 'లవ్యాపా' వంటి చిత్రాలలో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
తల్లి సూపర్ హిట్ 'మామ్' సీక్వెల్ లో ఖుషీ :
ప్రస్తుతం ఖుషీ కపూర్ తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించింది. తన తల్లి శ్రీదేవి నటించిన ల్యాండ్‌మార్క్ థ్రిల్లర్ 'మామ్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'మామ్ 2' లో ఆమె కథానాయికగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో జిషు సేన్‌గుప్తా, కరిష్మా తన్నా వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఖుషీ కపూర్, గ్లామర్‌తో పాటు నటనతోనూ రాబోయే రోజుల్లో బాలీవుడ్‌లో మరిన్ని పెద్ద విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
