Begin typing your search above and press return to search.

ఖుషికి 100% ఫ్రీ... బోనీకపూర్‌ ఫుల్‌ హ్యాపీ

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ సోదరి అయిన ఖుషి కపూర్‌ ఇప్పటికే నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే

By:  Ramesh Palla   |   4 Oct 2025 8:00 PM IST
ఖుషికి 100% ఫ్రీ... బోనీకపూర్‌ ఫుల్‌ హ్యాపీ
X

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ సోదరి అయిన ఖుషి కపూర్‌ ఇప్పటికే నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. కెరీర్‌ ఆరంభంలో నటిగా కాకుండా డైరెక్షన్‌ వైపు ఆసక్తి చూపించిన ఖుషి కపూర్ ఇప్పుడు పూర్తి స్థాయి నటిగా మారి హీరోయిన్‌గా సినిమాలు చేసింది, ముందు ముందు ఈమె నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఖుషి కపూర్‌ కి న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ వారు 100% స్కాలర్‌షిప్‌ ఇచ్చేందుకు సిద్ధం కావడం జరిగిందట. ఈ విషయాన్ని చాలా గర్వంగా ఖుషి కపూర్‌ తండ్రి బోనీ కపూర్‌ ప్రకటించారు. తన కూతురు ప్రతిభ పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. ఖుషి కపూర్‌ న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో నటనలో మరింతగా శిక్షణ తీసుకునేందుకు అతి త్వరలోనే వెళ్లే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఖుషి కపూర్‌కి 100% స్కాలర్‌షిప్‌

బోనీ కపూర్‌ తల్చుకుంటూ ఎంత ఫీజ్‌ అయినా కూతురు ఖుషి కపూర్‌కి చెల్లించి న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో జాయిన్‌ చేయగలరు. కానీ ఆమె నూరు శాతం స్కాలర్‌ షిప్‌ను దక్కించుకోవడంతో ఆమె ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు నటనపై ఉన్న ఆసక్తి దీంతో బయట పడిందని కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఖుషి కపూర్‌ నూరు శాతం స్కాలర్‌షిప్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఖుషి కపూర్‌ నటిగా ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు చేస్తుందనే విశ్వాసం మాకు ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు అక్క గ్లామర్‌తో గుర్తింపు దక్కించుకుంటే ఖుషి ఖచ్చితంగా తన నటన ప్రతిభతో గుర్తింపు దక్కించుకుంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

బోనీ కపూర్‌ హ్యాపీ

ఇటీవల బోనీ కపూర్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఖుషి కపూర్ గురించి మాట్లాడుతూ.. తన యొక్క బెస్ట్‌ ఆడిషన్స్‌ వీడియోను న్యూయార్స్ ఫిల్మ్‌ అకాడమీకి ఖుషి పంపించడం వల్లే వంద శాతం స్కాలర్‌షిప్‌కు ఎంపిక అయిందని బోనీ కపూర్ అన్నాడు. మీరు కూడా ఇలా చేయవచ్చు అంటూ ఆ కార్యక్రమానికి హాజరు అయిన వారికి బోనీ కపూర్‌ సూచించాడు. ఖుషి కపూర్‌ సాధించిన ఈ స్కాలర్‌షిప్‌ తండ్రిగా గర్వించేలా చేసిందని అన్నాడు. ఆమె రాబోయే రోజుల్లో బెస్ట్‌ నటిగా మరిన్ని గుర్తింపు, గౌరవాలు దక్కించుకోవాలని ఆశ పడుతున్నట్లుగా బోనీ కపూర్‌ చెప్పుకొచ్చాడు. ఖుషి కపూర్‌ ప్రతిభ విషయంలో బోనీ కపూర్ మాట్లాడుతున్న సమయంలో తండ్రిగా ఆయన చాలా సంతృప్తితో ఉన్నట్లుగా అర్థం అవుతుంది. ఖుషి కపూర్‌ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ నటిస్తుందేమో చూడాలి.

జాన్వీ కపూర్‌ తరహాలో ఖుషి కపూర్‌

ఖుషి 2023లో ది ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అంతకు ముందు నుంచే ఖుషి గురించి అందరికీ తెలుసు. శ్రీదేవి, బోనీ కపూర్ కూతురుగా, జాన్వీ కపూర్‌ సోదరిగా ఖుషి కపూర్‌ను గుర్తించే వారు. అయితే ఆ సినిమాలో నటనతో మెప్పించడంతో మంచి పేరు వచ్చింది. అయితే ఖుషి కపూర్‌కి లక్‌ కలిసి రాకపోవడంతో మరిన్ని సినిమాల్లో ఆఫర్లు రాలేదు. ఈ ఏడాదిలో ఈమె నటించి రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా ఖుషి కపూర్‌ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా రెండు వెబ్‌ సిరీస్‌లు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. జాన్వీ కపూర్‌ స్థాయిలో ఖుషి ఎప్పుడు బిజీ అవుతుందా అంటూ శ్రీదేవి ఫ్యాన్స్‌తో పాటు, కపూర్‌ ఫ్యామిలీని అభిమానించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.