Begin typing your search above and press return to search.

ఫోటోషూట్ల కోసం ఇన్ని పాట్లు ప‌డాలా ఖుషీ?

ఫోటోషూట్ల కోసం ఖుషీ పడే శ్రమ, పర్ఫెక్ట్ లుక్ కోసం ఈ బ్యూటీ మెయింటైన్ చేసే స్టైల్ చూసి అభిమానులు `అచ్చం శ్రీదేవి లాగే ఉంది` అని కామెంట్స్ చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   22 Feb 2026 11:00 AM IST
ఫోటోషూట్ల కోసం ఇన్ని పాట్లు ప‌డాలా ఖుషీ?
X

శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ తన సోదరి జాన్వీ కపూర్ బాటలోనే గ్లామర్ ఎలివేష‌న్ లో త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. కెరీర్ ఆశించిన రేంజుకు టేకాఫ్ అవ్వ‌క‌పోయినా, ఈ భామ నిరాశ చెంద‌క త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఖుషీ కపూర్ సినిమా మ్యాట‌ర్స్ తో పాటు డేటింగ్ వ్య‌వ‌హారాలు నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఖుషీ కపూర్ తాజా ఇన్‌స్టా పోస్ట్ లో `ఫిబ్ర‌వ‌రి సో ఫార్` అంటూ తన జ్ఞాపకాలను షేర్ చేసారు. అందులో ఖుషీ ధరించిన ఎరుపు రంగు దుస్తులు, బోల్డ్ లుక్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఫోటోషూట్ల కోసం ఖుషీ పడే శ్రమ, పర్ఫెక్ట్ లుక్ కోసం ఈ బ్యూటీ మెయింటైన్ చేసే స్టైల్ చూసి అభిమానులు `అచ్చం శ్రీదేవిలాగే ఉంది` అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫోటోషూట్ కోసం ఎంత‌గా శ్ర‌మించాలో తాజాగా ఖుషీ షేర్ చేసిన ఓ వీడియో షూట్ వెల్ల‌డిస్తోంది. త‌న హెయిర్, ముఖ క‌వ‌ళిక‌ల్ని బ్యాలెన్స్ చేస్తూ, గాలికి ఎగిరే ముంగురుల ఎఫెక్ట్ తేవ‌డానికి ఒక టీమ్ ఎంతో శ్ర‌మిస్తోంది. తాజా ఫోటోషూట్ లో ఈ వీడియో ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంది.

ఖుషీ త‌దుప‌రి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అక్క జాన్వీ కపూర్ ఇప్పటికే దేవరతో తెలుగులో సక్సెస్ అందుకుంది కాబట్టి, ఖుషీ కూడా సరైన భారీ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు.

బాలీవుడ్ లో ఖుషీ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. శ్రీదేవి నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా మామ్ కి సీక్వెల్‌గా రాబోతున్న `మామ్ 2`లో ఖుషీ కపూర్ కీర్తి అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది ఖుషీ క‌పూర్ కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా కానుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్‌తో కలిసి ఖుషీ బంద‌ర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మే 22న విడుదలయ్యే అవకాశం ఉంది. ఖుషీ న‌టించిన నాద‌నియాన్, ల‌వ్ యాపా చిత్రాలు ఫ్లాపులైన సంగ‌తి తెలిసిందే. అయినా నిరాశ చెంద‌క త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారించింది.

పర్సనల్ లైఫ్ - బాయ్‌ఫ్రెండ్ మ్యాట‌ర్..

ఖుషీ కపూర్ `ది ఆర్చీస్` కో-స్టార్ వేదాంగ్ రైనాతో గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తాజా సీన్ చూస్తుంటే, వీరు గతంలోలా కలిసి కనిపించడం లేదు. వేదాంగ్ రైనా కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ప్రస్తుతం తన కెరీర్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని చెప్పడం బ్రేక‌ప్ వార్తలకు బలాన్ని చేకూర్చింది.

ఖుషీ కపూర్ తన సినిమాలతో పాటు తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ బ్యూటీ టాలీవుడ‌ ఎంట్రీ ఖరారైతే అది కచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుంది. కానీ దానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం.