Begin typing your search above and press return to search.

జెన్-జీ బిజినెస్ మంత్రను బయటపెట్టిన ఖుషి కపూర్!

నటిగా కొనసాగుతూనే ‘నెయిలినిట్‌’ ప్రెస్‌ఆన్ నెయిల్స్ బ్రాండ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఖుషీ కపూర్‌.. జెన్‌ జీ మార్కెటింగ్‌ విధానాలపై తన అభిప్రాయాలు పంచుకుంది. నేటి యువత రొటీన్‌ ప్రకటనల కంటే నిజాయితీతో కూడిన బ్రాండింగ్‌ను ఇష్టపడుతున్నారని తెలిపింది. సోషల్‌ మీడియా అవకాశాలతో పాటు అందంగా కనిపించాలనే ఒత్తిడిని కూడా పెంచుతోందని అభిప్రాయపడింది.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 12:00 PM IST
జెన్-జీ బిజినెస్ మంత్రను బయటపెట్టిన ఖుషి కపూర్!
X

అతిలోక సుంద‌రి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ న‌టిగా వెలిగిపోతుంటే? చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ మాత్రంకెరీర్ ను రెండు ర‌కాలుగా ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే న‌టిగా రెండు..మూడు సినిమాల్లో క‌నిపించింది.

ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు బిజినెస్ వరల్డ్‌లోనూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది. దానికి సంబంధించి ఆసక్తికర విషయాలను రివీల్ చేసింది. త‌న‌కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేస్తున్న ఖుషీ జెన్ జీ యువ‌త‌ ఆలోచనా విధానం ఎలా? ఉంటుందో వివరించే ప్ర‌య‌త్నం చేసింది.

వ్యాపార రంగంలో వస్తువులను మార్కెటింగ్ చేసే తీరులో పాత తరాలకు.. ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని అభిప్రాయ‌ప‌డింది. ఈ తరానికి చెందిన వ్యాపారవేత్తలు ..క్రియేటర్లు ఎవరికోసమో నటించకుండా అథెంటిక్ గా ఉంటారంది. `ఈ తరానికి చెందిన ప్రత్యేకత ఏంటంటే? ప్రతి ఒక్కరూ తాము ఎవరిలా ఉండాలనుకుంటున్నారో అలా మొహమాటం లేకుండా ఉంటారు. ఎవరికైనా ఒక వస్తువును అమ్మేటప్పుడు మనం ఏదో బలవంతంగా అమ్ముతున్నామనే ఫీలింగ్ కలగకుండా అమ్మడం ముఖ్యం.

గతంలో మాదిరిగా ఒకే రకమైన రొటీన్ ప్రకటనలను చూసేందుకు ఇప్పడున్న ఆడియన్స్ అసలు ఇష్టపడడం లేదు. నిజంగా వాడే వస్తువులనే ఇతరులకు రికమండ్ చేయడానికి ఇష్టపడుతున్నార‌ని` అభిప్రాయపడింది. అయితే సోషల్ మీడియా లో వ‌చ్చే సానుకూల అంశాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని ఖుషి నిజాయితీగా అంగీకరించింది. డిజిట‌ల్ ప్లాట్‌ఫారమ్‌లు తమను తాము స్వేచ్ఛగా చెప్పుకోవ‌డానికి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నా? మరోవైపు సమాజంలో అందంగా కనిపించాలనే ఒత్తిడిని కూడా పెంచుతున్నాయంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అంద‌రూ 100 శాతం నిజంగానే ఉంటారని చెప్పలేం. ఎందుకంటే ప్రజలు తమను తాము ఎలా నలుగురు చూడాలని కోరుకుంటారో? అదే అక్కడ కనిపిస్తుందని విశ్లేషించింది.

అయినా బయటి ప్రపంచంలో వ్యక్తం చేయడానికి ఇష్టపడని తమలో సరదా కోణాలను గదిలో కూర్చునే నలుగురితో పంచుకోవడానికి సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోందని అభిప్రాయపడింది. ప్రెస్‌ఎన్ నెయిల్స్ బ్రాండ్ `నెయిలినిట్` ద్వారా వ్యాపార రంగంలోకి ప్రవేశించిన ఖుషి కపూర్ సోషల్ మీడియా వల్ల లాభాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంది. నెటిజన్లను ఆకట్టుకోవాలంటే ప్రకటనల జోరు కంటే నిజాయితీతో కూడిన ప్రెజెం టేషనే ప్రధానమని ఖుషీ బ‌లంగా న‌మ్ముతుంది.

సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్ని స్తున్న ఖుషి కపూర్ నేటి డిజిటల్ యుగంలో బ్రాండింగ్ ఎలా ఉండాలో? తన అనుభవంతో చెప్ప‌క‌నే చెప్పింది. గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా మార్కెట్ ట్రెండ్స్‌ను అర్థం చేసుకుంటూ చేస్తోన్న‌ వ్యాపార ప్రయాణం యువతకు స్పూర్తినిచ్చేలా ఉంది. అలాగే కేవ‌లం సినిమాల‌నే న‌మ్ముకుని కెరీర్ ని ఏకాకిగా మ‌లుచుకోవ‌ద్దు అన్న సంకేతాన్ని అమ్మ‌డు పంపిన‌ట్లు అయింది.