ఫ్రెండు బర్త్‌డే పార్టీలో కపూర్ గాళ్ రచ్చ రచ్చ
శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది.
By: Sivaji Kontham | 2 Nov 2026 9:00 PM ISTశ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. అక్క జాన్వీ కపూర్ ఇప్పటికే వరుస సినిమాలతో నటిగా బాలీవుడ్ టాలీవుడ్‌లో దూసుకుపోతుంటే.. ఖుషీ మాత్రం తన గ్లామరస్ మోడలింగ్ షూట్స్.. డిజైనర్ వేర్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా తన బాబాయి కుమార్తె, ఆత్మీయ స్నేహితురాలు షనాయా కపూర్ పుట్టినరోజు వేడుకల్లో ఖుషీ చేసిన రచ్చ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఖుషీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన హాలొవీన్ థీమ్ బర్త్‌డే ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. తన స్నేహితురాలు సానయాకు హ్యాపీ బర్త్ డే చెబుతూ ``తాంత్రిక సమయం!`` అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డార్క్ థీమ్ హాలొవీన్ వైబ్‌తో ఉన్న ఈ ఫోటోలు ఖుషీ, షానయాల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని చూపించడమే కాకుండా.. ఒక డ్రామాటిక్ బోల్డ్ లుక్‌ను ఎలివేట్ చేసాయి.
ఈ బర్త్‌డే పోస్ట్‌పై కపూర్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, స్నేహితులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు. మహీప్ కపూర్, సంజయ్ కపూర్, సెలబ్రిటీ ఫ్రెండ్ ఓరీ, అంజినీ ధావన్ తదితరులు కామెంట్ బాక్స్‌లో లవ్ ఎమోజీలు షేర్ చేస్తూ షనాయాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యామిలీతో పాటు సోషల్ మీడియా స్టార్స్ కూడా స్పందించడంతో ఈ ఫోటోలు నెట్టింట మరింత ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఇక నెటిజన్లు... ఫ్యాన్స్ ఈ ఫోటోషూట్ స్టైలింగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. థీమ్‌కు సరిగ్గా సరిపోయేలా బ్లాక్ హార్ట్, ఫైర్, స్కల్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ను నింపేశారు. ఫోటోలలో ఖుషీ, షనాయా ధరించిన నలుపు రంగు క్లాసీ దుస్తులు.. ఐ క్యాచీ మేకప్.. మూడీ లైటింగ్ .. వీటన్నిటినీ మించి గాళ్స్ గ్యాంగ్ గ్లామరస్ పోజుల గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఇలా గ్లామరస్ విజువల్స్‌తో.. హాలొవీన్ వైబ్‌తో బర్త్‌డే పార్టీల్లో రచ్చ చేయడం సరే కానీ..నటిగా నిరూపించుకోవడానికి ఖుషీ ఏం చేయబోతోందనేదే ఇప్పుడు అసలైన సస్పెన్స్. మోడలింగ్‌లో తనదైన మార్క్ చూపిస్తున్న ఈ కపూర్ గాళ్ పక్కాగా జెన్ జీని మెప్పించే రోల్స్ ఎంచుకుని సిల్వర్ స్క్రీన్‌పై నటిగా తన స్టామినాను ఎప్పుడు నిరూపిస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖుషీ కపూర్ ప్రస్తుతం `మామ్` సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీదేవి నటించిన హిట్ సినిమా `మామ్` చిత్రానికి సీక్వెల్. ప్రాజెక్ట్ గురించి తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది.
