అలాంటి ఫోజులతో అక్కకు స్పెషల్ విషెస్ చెప్పిన ఖుషీ కపూర్!
తన అందం అభినయంతో తన తల్లిని తలపిస్తూ పలువురు స్టార్ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.
By: Madhu Reddy | 6 March 2026 3:55 PM ISTఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు, తమిళ్ , హిందీ అని తేడా లేకుండా సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోల వరకు ఎంతోమందితో సినిమాలు చేసి తన అందం అభినయంతో అతిలోకసుందరిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది శ్రీదేవి. అలాంటి ఈమె అనూహ్యంగా దుబాయ్ లో మరణించడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే శ్రీదేవి మరణం ఇప్పటికీ ఎప్పటికీ మిస్టరీనే అన్నట్టుగా మారిపోయింది. శ్రీదేవి స్థానాన్ని భర్తీ చేయడానికి ఆమె వారసురాలు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రంగంలోకి అడుగు పెట్టింది.
తన అందం అభినయంతో తన తల్లిని తలపిస్తూ పలువురు స్టార్ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇకపోతే బాలీవుడ్ లో సినిమాలు చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంటున్న ఈమె.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూనే ఇక్కడ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. ప్రస్తుతం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ఇకపోతే ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఈమెకు ఈమె చెల్లెలు ఖుషి కపూర్ తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ.. తన అక్కకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తన అక్క జాన్వీ కపూర్ తో కలిసి అల్లరి చేసిన చిన్ననాటి ఫోటోలతో పాటు ఇటీవల తమ పెట్ డాగ్ తో కలిసి ఇద్దరు సిస్టర్స్ ఎంజాయ్ చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ స్పెషల్ క్యాప్షన్ షేర్ చేసింది. అలాగే తన తల్లి శ్రీదేవితో దిగిన ఫోటోలను కూడా ఖుషీ కపూర్ షేర్ చేసింది.
"నా సోదరి ,నా ప్రాణ స్నేహితురాలు,నా సలహాదారు,నా గురువు , నా నేర భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఈరోజు ఇలా మారడానికి కారణం నువ్వే. నువ్వు లేకుండా నేను శూన్యం.. నేను ఏ జన్మ ఎత్తినా సరే నా ప్రతి జన్మలో కూడా నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను అంటూ తన అక్కపై ప్రేమ ఒలకబోస్తూ ఖుషి కపూర్ ఒక పోస్టు షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఖుషి కపూర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్క చెల్లెలు ఇద్దరు ఇంత అల్లరిగా ఉంటారా అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
జాన్వి కపూర్ విషయానికొస్తే.. పెద్ది సినిమా నుండి అచ్చియమ్మ అంటూ ఒక పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జాన్వీ కపూర్ .. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. శ్రీవారి ఆశీర్వాదం అందుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
