Begin typing your search above and press return to search.

ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో ఖుషీ కపూర్ రీ-యూనియన్!

అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ వ్య‌క్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలిచింది.

By:  Srikanth Kontham   |   2 Sept 2026 6:00 PM IST
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో ఖుషీ కపూర్ రీ-యూనియన్!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ వ్య‌క్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలిచింది. `ది ఆర్చీస్` చిత్రంతో వెండితెరకు పరిచయమైన యువ నటి మాజీ ప్రియుడు ఆకాష్ మెహ‌తాతో మళ్లీ ప్రేమలో పడిందంటూ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఇద్ద‌రు మళ్లీ ఒకరికొకరు దగ్గరయ్యారని, తమ పాత బంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయిం చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖుషీ కపూర్ మాజీ ప్రేమికుడితో కలిసి ముంబైలోని పలు ప్రముఖ ప్రదేశాల్లో తరచూ కనిపిస్తుండటంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.

గతంలో కొన్ని కారణాల వల్ల విడిపోయిన జంట ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మళ్లీ కలుసుకున్నారని సమాచారం. ఆ కలయికే వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలను మళ్లీ చిగురించేలా చేసిందని.. ప్రస్తుతం ఇద్ద‌రు ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ కన్నేసి ఉంచే కెమెరాల కంట పడకుండా ఈ జంట తమ డేటింగ్‌ను కాస్త రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా? సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల కదలికలు దాచడం కష్టం కావడంతో రీ-యూనియన్ వార్త క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ కొత్త పరిణామంతో ఖుషీ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఖుషీ కపూర్ కెరీర్ ప్రారంభం నుంచే ఆమె వ్యక్తిగత విషయాలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. గతంలో ఆమెతో పాటు నటించిన కొందరు సహనటులతో పేరు ముడిపడి ఉన్నా? ఆమె లవ్ లైఫ్‌పై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా మళ్లీ మాజీ ప్రియుడితో పాత బంధాన్ని పునరుద్ధ రించుకోవడమనేది బి-టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఖుషీ కపూర్ కెరీర్‌పై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మ‌డు తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీ అవుతూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ వార్త బాలీవుడ్ పేజ్-3 సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రీ-యూనియన్ వార్తలపై ఖుషీ కపూర్ కానీ, ఆమె కుటుంబ సభ్యులుకానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఖుషీ క‌పూర్ సోద‌రి జాన్వీ క‌పూర్ ప్రేమాయ‌ణంపై కూడా ఆ కుటుంబం ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌ని సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా జాన్వీ శిఖ‌ర్ ప‌హారియాతో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి అక్కా-చెల్లెళ్లు ఇద్ద‌రు ఒకేసారి విష‌యాన్ని అభిమానుల‌కు చెప్పాల‌నుకుంటున్నారో? ఏమో తెలియాలి.