Begin typing your search above and press return to search.

ఖుష్బూకు వ‌ర్ణించ‌డానికి మాట‌ల్లేవ‌ట‌!

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ధురంధ‌ర్‌' భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   10 Jan 2026 5:00 AM IST
ఖుష్బూకు వ‌ర్ణించ‌డానికి మాట‌ల్లేవ‌ట‌!
X

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ధురంధ‌ర్‌`భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ర్యాంపేజ్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.1200 కోట్ల‌కు పైనే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స్టిల్ అదే హ‌వాని కొన‌సాగిస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది.

సినిమాపై కొంత మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే సెల‌బ్రిటీలు, స‌గ‌టు సినీ ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సినిమా మేకింగ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ డేర్‌ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి సినిమా ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని, మేకింగ్‌, టేకింగ్ విష‌యాల్లో 'ధురంధ‌ర్‌' భార‌తీయ సినిమాల్లో స‌రికొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికింద‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సీనియ‌ర్‌న‌టి ఖుష్బూ చేరారు. ఈ మూవీపై న‌టి ఖుష్బూ తాజాగా సోష‌ల్మీడియా వేదిక‌గా స్పందించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

ఫైన‌ల్‌గా `ధురంధ‌ర్` సినిమా చూశాను. నేను అద్భుత‌మైన అనుభూతిని పొందుతూ ఆశ్చ‌ర్య‌పోయాన‌ని చెప్ప‌డం కూడా త‌క్కువే అవుతుంది. ఆదిత్య ధ‌ర్ మొత్తం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల బృందం చాలా ధైర్య‌వంతులు. ప్ర‌తి ఫ్రేమ్‌, ప్ర‌తి మాట‌, ప్ర‌తి క్ష‌ణం ఒక స్ఫూర్తిదాయ‌క‌మైన ఉద్య‌మంగా మారుతుంది. `ఇది కొత్త హిందుస్థాన్‌` అని విన్న‌ప్పుడు నేను చ‌ప్ప‌ట్లు కొట్టాను. సినిమా పూర్త‌య్యే స‌రికి మీ క‌ళ్లు చెమ‌ర్చుతాయి. అంతే కాకుండా గ‌ర్వంతో మీ గుండె ఉప్పొంగుతుంది. ఆదిత్య‌ధ‌ర్‌కు వంద‌నం. భావోద్వేగాల‌కు చోటు క‌ల్పించారు. గ‌ర్వంతో మ‌న‌సు నింపేశారు. ర‌ణ్‌వీర్‌సింగ్ అద్భుతంగా న‌టించాడు.

మాధ‌వ‌న్ సున్నితంగా, శ‌క్తివంతంగా, అద్భుతంగా క‌నిపించారు. ఇక రాకేష్ బేడీ గారు అద్భుతం. కానీ అక్ష‌య్‌ఖ‌నా్న అనే వ్య‌క్తి అంద‌రినీ మించిపోయి త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నాడు. అత‌ని తండ్రి స్వ‌ర్గం నుంచి చూస్తూ అత‌న్ని చూసి న‌వ్వుతార‌ని నేను ఖ‌చ్చితంగా అనుకుంటున్నాను. అత‌న్ని వ‌ర్ణించ‌డానికి మాట‌లు స‌రిపోవు. అత‌ను ఆ పాత్ర‌లో జీవించాడు. అత‌న్ని ద్వేషించ‌డాన్ని కూడా ప్రేమించాను.` అంటూ `ధురంధ‌ర్‌` సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఖుష్బూ ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. క్రియాశీల రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమె గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కేవ‌లం ప్ర‌త్యేక అతిథి పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ప్ర‌స్తుతం `పంజా` ఫేమ్ విష్ణువ‌ర్ధ‌న్ రూపొందిస్తున్న `నెసిప్పాయ‌`లో న‌టిస్తోంది. రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీలోఅదితి శంక‌ర్ హీరోయిన్‌.