Begin typing your search above and press return to search.

ఆరు ప‌దుల వ‌య‌సులో బాక్సాఫీస్ ఫైట్‌!

ఆరుప‌దుల వ‌య‌సులో బాక్సాఫీస్ స‌మ‌రానికి సై అంటున్నారు బాలీవుడ్ ఖాన్ త్ర‌యం స‌ల్మాన్ ఖాన్‌, షారుక్ ఖాన్‌, ఆమీర్ ఖాన్‌.

By:  Tupaki Entertainment Desk   |   11 Jan 2026 8:30 PM IST
ఆరు ప‌దుల వ‌య‌సులో బాక్సాఫీస్ ఫైట్‌!
X

ఆరుప‌దుల వ‌య‌సులో బాక్సాఫీస్ స‌మ‌రానికి సై అంటున్నారు బాలీవుడ్ ఖాన్ త్ర‌యం స‌ల్మాన్ ఖాన్‌, షారుక్ ఖాన్‌, ఆమీర్ ఖాన్‌. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ బాలీవుడ్ ఖాన్స్ ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేస్తున్నారు. ఒక ద‌శ‌ల వంద‌ల కోట్లు బాక్సాఫీస్ వ‌ద్ద పుల్ చేసిన ఈ స్టార్స్ కోవిడ్ నుంచి వ‌రుస డిజాస్ట‌ర్ల‌ని ఎదుర్కొంటూ అభిమానుల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేశారు. ఫైన‌ల్‌గా మారిన ప్రేక్ష‌కుల నాడికి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఈ క్ర‌మంలో ముగ్గురు ఖాన్‌ల‌లో ముందు బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకుంది షారుక్ ఖాన్. ఐదేళ్ల త‌రువాత షారుక్ `ప‌ఠాన్‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా సిద్ధార్ధ్ ఆనంద్ తెర‌కెక్కించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి షారుక్‌కు బిగ్ క‌మ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ మూవీ త‌రువాత అదే ఊపుతో షారుఖ్ చేసిన `జ‌వాన్‌` కూడా ఇదే త‌ర‌హా విజ‌యాన్ని అందించి స‌రికొత్త రికార్డుని సృష్టించింది. `డంకీ` ఫ్లాప్ కావ‌డంతో మూడేళ్ల త‌రువాత షారుక్ `కింగ్‌`తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. దీపికా ప‌దుకోన్ తో పాటు అభిషేక్ బ‌చ్చ‌న్‌, అనిల్ క‌పూర్‌, జాకీష్రాఫ్‌, అర్ష‌ద్ వ‌ర్సీ, రాణీ ముఖ‌ర్జీ, `కిల్‌` ఫేమ్‌ రాఘ‌వ్ జుయ‌ల్, జైదీప్ అహ్లావ‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. షారుక్ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. షారుక్ తో పాటు ఇదే ఏడాది స‌ల్మాన్ ఖాన్ కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. గ‌త కొంత కాలంగా వ‌రుస ష్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం క‌ల్న‌ల్ బి. సంతోష్‌బాబు రియ‌ల్ లైఫ్ స్టోరీని ఎంచుకున్నాడు.

స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తూ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ `బాటిల్ ఆఫ్ గ‌ల్వాన్‌`. గ‌ల్ఆన్ లోయ‌లో ఇండియ‌న్ ఆర్మీకి, చైనీస్ ఆర్మీకి మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ కార‌ణంగా ఎంతో మంది ఇండియ‌న్ ఆర్మీ సోల్జ‌ర్స్ మ‌రణించారు. చైనా సైన్యానికి ఎదురు నిలిచి వారి ఆట‌లు క‌ట్టించిన క‌ల్నాల్ బి. సంతోష్‌బాబు అమ‌రుడ‌య్యాడు. నాటి సంఘ‌ట‌న నేప‌థ్యంలో స‌ల్మాన్ `బాటిల్ ఆఫ్ గ‌ల్వాన్‌` నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని స‌ల్మాన్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

ఈ ఇద్ద‌రికి కొంత భిన్నంగా ఆమీర్‌ఖాన్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఏరి కోరి చేసిన ఫారెస్ట్ గంప్ రీమేక్ లాల్ సింగ్ చ‌ద్దా`, అంత‌కు ముందు అమితాబ్‌తో క‌లిసి చేసిన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌` వంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ డిజాస్ట‌ర్లు కావ‌డంతో కొంత ఆలోచ‌న‌లో ప‌డిన ఆమీర్‌ఖాన్ సోలో హీరోగా సినిమా చేయాలంటే ఆలోచిస్తున్నాడు. రీసెంట్‌గా చేసిన సితారే జ‌మీన్‌ప‌ర్ కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో గెస్ట్‌రోల్స్‌, ప్రొడ్యూస‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైపోతున్నాడు. ఈ ఏడాద ప్రొడ్యూస‌ర్‌గా, గెస్ట్ ఆర్టిస్ట్‌గా హ్యాపీ ప‌టేల్ ఖ‌త‌ర్నాక్ జాసూస్‌, స‌న్నీ డియోల్‌తో `లాహోర్ 1947` సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండూ ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇలా అర‌వైఏళ్ల వ‌య‌సులో బాక్సాఫీస్‌పై దాడికి సిద్ధ‌ప‌డుతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.