Begin typing your search above and press return to search.

గ్రేట్ క‌ల్ట్ క్లాసిక్ సీక్వెల్‌ని 100శాతం క‌న్ఫామ్ చేసేసాడు!

ఇటీవల `ఇండియా టుడే`తో మాట్లాడిన జాకీ ష్రాఫ్ ఈ సీక్వెల్‌లో భాగం కావడం చాలా ఎగ్జ‌యిట్ చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు

By:  Sivaji Kontham   |   1 Jun 2026 10:35 AM IST
గ్రేట్ క‌ల్ట్ క్లాసిక్ సీక్వెల్‌ని 100శాతం క‌న్ఫామ్ చేసేసాడు!
X

బాలీవుడ్ సినీ చరిత్రలో 1993లో వచ్చిన యాక్షన్ బ్లాక్‌బస్టర్ చిత్రం `ఖల్ నాయక్` సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రఖ్యాత దర్శకుడు సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా సంజయ్ దత్ కి ఒక ఐకానిక్ యాక్షన్ కింగ్‌గా కల్ట్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ క‌ల్ట్ క్లాసిక్ కి కొనసాగింపుగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత `ఖల్ నాయక్ రిటర్న్స్` పేరిట తెర‌కెక్క‌నున్న సీక్వెల్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నట్లు సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ అధికారికంగా ధృవీకరించారు.

ఇటీవల `ఇండియా టుడే`తో మాట్లాడిన జాకీ ష్రాఫ్ ఈ సీక్వెల్‌లో భాగం కావడం చాలా ఎగ్జ‌యిట్ చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. దీని కోసమే నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన‌ని అన్నారు. త‌ద్వారా సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని సీనియ‌ర్ న‌టుడు జాకీష్రాఫ్‌ వంద శాతం ఖరారు చేశారు. అంతేకాకుండా.. ఒరిజినల్ చిత్రంలో తను పోషించిన ఇన్‌స్పెక్టర్ రామ్ పాత్ర ఈ సీక్వెల్‌లో ఏ విధంగా మారుతుందో అత‌డు పెద్ద హింట్ ఇచ్చారు. ``సినిమాలో కమీషనర్ క‌చ్చితంగా ఉండాలి కదా.. కమీషనర్ ఉంటాడు కదా!`` అని వ్యాఖ్యానించడంతో పాత చిత్రంలోని ఇన్‌స్పెక్టర్ రామ్ ఇప్పుడు ప్రమోషన్ పొంది పోలీస్ కమీషనర్‌గా దర్శనమివ్వబోతున్నట్లు క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే చిత్రబృందంతో చ‌ర్చించాన‌ని జాకీ ష్రాఫ్ స్వయంగా వెల్లడించడంతో ఇది వంద‌శాతం ప‌క్కా! అంటూ ఫ్యాన్స్ ఫిక్స‌యిపోయారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి ఒరిజినల్ సినిమా దర్శక‌నిర్మాత అయిన సుభాష్ ఘాయ్‌తో పాటు సహ నటుడు సంజయ్ దత్‌తో తాను ఇప్పటికే మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఖల్ నాయక్ చిత్రంలో వీరిద్దరి ఆన్-స్క్రీన్ కాంబినేషన్ -కెమిస్ట్రీ సినిమా విజయానికి ఒక ప్రధాన బ‌లంగా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అదే కాంబినేషన్‌ను వెండితెరపై పునరావృతం చేయడానికి సన్నాహాలు జరుగుతుండడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా సంజయ్ దత్‌తో ఉన్న తన సుదీర్ఘ అనుబంధాన్ని, స్నేహాన్ని జాకీ ష్రాఫ్ గుర్తు చేసుకున్నారు. మళ్లీ సంజూ బాబాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. స్నేహితుల‌తో క‌లిసి రిపీటెడ్ గా ప‌ని చేయ‌డం హ్యాపీనే.. సంజూ బాబా నా ప్రాణం అంటూ తన స్నేహితుడిపై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. జాకీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. పాత కాలపు మిత్రులు ఇద్దరూ కలిసి ఈ యాక్షన్ డ్రామాను ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారోనని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

చాలా ప్ర‌చారం త‌ర్వాత ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ క్లాసిక్ హిట్స్ సీక్వెల్స్ రేసులో `ఖల్ నాయక్ రిటర్న్స్` అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవబోతోంది. నాటి రోజుల్లో సంజయ్ దత్ నెగటివ్ షేడ్స్ ఉన్న టైటిల్ రోల్‌లో మెప్పించగా... జాకీ ష్రాఫ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రక్తి కట్టించారు. ఇప్పుడు ముప్పై ఏళ్ల తర్వాత మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కమీషనర్ హోదాలో జాకీ ష్రాఫ్ ను సీక్వెల్ లో చూడ‌వ‌చ్చు. అలాగే మారిన పాన్ ఇండియా ట్రెండ్ లో సంజయ్ దత్ పాత్ర ఎలా ఉండ‌నుందో చూడాల‌నే ఆస‌క్తి ఖ‌ల్ నాయ‌క్ ఫ్యాన్స్ లో ఉంది.