'ఖాకీ 2' పనులు మొదలయ్యాయా?
తాజాగా వినోద్ నుంచి పిలుపు రావడంతో కార్తీ కూడా డేట్స్‌ను సర్దుబాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
By: Srikanth Kontham | 26 March 2026 9:15 AM ISTకార్తీ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ `ఖాకీ` ఎంత పెద్ద విజయం సాధిచిందో తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆద్యంతం ఒకటే పరుగులు పెట్టిస్తుంది. పోలీస్ పాత్రలో కార్తీ నటన, దర్శకుడిగా వినోద్ పనితనం శెభాష్ అనిపిస్తాయి. ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడా? అని `ఖాకీ` అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ పై ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా కథనాలు అంతకంతకు వెడెక్కించాయి. తాజాగా అందుకు సమయం ఆసన్నమైంది.
ప్రస్తుతం వినోద్ దళపతి విజయ్ హీరోగా `జన నాయగన్` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్నా? సినిమా కోర్టు వివాదాల నేపథ్యంలో రిలీజ్ కు నోచుకోలేదు. దీంతో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో కూడా క్లారిటీ లేదు. ఈ సినిమాకు సంబంధించి వినోద్ చేయాల్సిందల్లా ఏం లేదు. తన పని తాను పూర్తిచేసి ప్రోడక్ట్ నిర్మాతలకు అప్పజెప్పాడు. దీంతో అతడి పని పూర్తయింది. కేవలం ప్రచారం పనులు మాత్రమే వినోద్ నిర్వహించాల్సి ఉంటుంది. రిలీజ్ ఎలాగూ లేదు కాబట్టి! తాత్కాలికంగా ఆ విషయాలన్ని పక్కనబెట్టి `ఖాకీ2` పనుల్లో నిమగ్నమయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
వినోద్ తన సినిమాల కోసం చాలా లోతైన రీసెర్చ్ చేస్తారు. `ఖాకీ` మొదటి భాగం కోసం `ఆపరేషన్ బావరియా`పై ఎలాగైతే అధ్యయనం చేశారో? తాజాగా `ఖాకీ 2` కోసం కూడా ఒక వాస్తవిక నేర పరిశోధన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగాన్ని మించి రెండవ భాగాన్ని తీర్చి దిద్దాలని లోతైన ఎనాలసిస్ తో స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. హీరో కార్తీ ఇప్పటికే ఈ సీక్వెల్ చేయడానికి సుముఖతను వ్యక్తం చేశారు. గతంలోనే ఆయన మాట్లాడుతూ `వినోద్ దగ్గర `ఖాకీ 2` కోసం ఒక అద్భుతమైన ఐడియా ఉందన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని హింట్ ఇచ్చారు.
తాజాగా వినోద్ నుంచి పిలుపు రావడంతో కార్తీ కూడా డేట్స్‌ను సర్దుబాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటి భాగం నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. సాంకేతికంగా ఈ సినిమా మొదటి భాగం కంటే ఉన్నత ప్రమాణాలతో ఉంటుందని, ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇందులో ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా యధావిధిగా జిబ్రాన్ కొనసా గుతాడని సమాచారం. ప్రస్తుతం కార్తీ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటి నుంచి కార్తీ రిలీవ్ అవ్వడానికి ఎలా లేదన్నా నాలుగైదు నెలలు సమయం పడుతుంది.
