Begin typing your search above and press return to search.

లోకేశ్ నిర్ణయంతో ఆ హీరో ఫ్యాన్స్ హర్ట్

టాలీవుడ్ స్టార్ హీరో కార్తి ఖైదీ 2 సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్ భారీ స్థాయిలో విజయం సాధించిన తర్వాత.. వాళ్లతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నారు.

By:  M Prashanth   |   3 Sept 2025 10:44 AM IST
Khaidi 2 Music Twist: Anirudh Replaces Sam CS?
X

టాలీవుడ్ స్టార్ హీరో కార్తి ఖైదీ 2 సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్ భారీ స్థాయిలో విజయం సాధించిన తర్వాత.. వాళ్లతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమా సంగీతానికి సంబంధించి కొత్త ట్విస్ట్ వచ్చింది.

2019లో విడుదలైన ఖైదీ సినిమా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ యూనివర్స్ లో తొలి సినిమా. LCUలో మొదటి సినిమానే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు అతిపెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా విజయంలో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కానీ, ఈ సినిమా సీక్వెల్ కు లోకేశ్ కనగరాజ్.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది.

కానీ ఖైదీ తర్వాత, లోకేశ్ కనగరాజ్.. మాస్టర్ సినిమా కోసం అనిరుధ్ తో కలిసి పని చేశారు. అప్పట్నుంచి తాజాగా విడుదలైన 'కూలీ' వరకు అతనినే తన అన్ని ప్రాజెక్టులకు కొనసాగించారు. కూలీ తర్వాత ఖైదీ 2 వెంటనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సీక్వెల్, లోకేష్ కనగరాజ్ హీరోగా తొలి ప్రాజెక్ట్, అలాగే కమల్ హాసన్, రజనీకాంత్ తో పెద్ద మల్టీస్టారర్ చిత్రం కారణంగా ఈ సినిమా మళ్ళీ ఆలస్యం అయింది.

ఇప్పుడు ఖైథీ 2 కి సంగీత దర్శకుడి ఎంపికతో మరో ట్విస్ట్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం, సామ్ సిఎస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోకేశ్ తాను మాత్రమే ఖైదీ 2 కి సంగీతం అందించాలని అన్నాడని చెప్పాడు. అయితే లోకేశ్ ఇటీవల ఓ సందర్భంలో అనిరుధ్ లేకుండా తాను సినిమా తీయబోనని చెప్పారు.

అంటే తన అన్ని సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటారని లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన ఖైదీకి కూడా అనిరుద్ సంగీతం అందించనున్నాడని అర్థమైపోతుంది. ఇది కచ్చితంగా సామ్ సిఎస్ తోపాటు ప్రేక్షకులను కూడా బాధపెడుతుంది.