రజనీ - కమల్ మూవీ కోసం ఓల్డ్ ఫార్ములా!
కోలీవుడ్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
By: Ravindar Gorantla | 2 March 2026 9:00 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్ల క్రితం ఈ ఇద్దరు లీవింగ్ లెజెండ్స్ కలిసి ఐదు భాషల్లో 21 సినిమాలు చేశారు. ఇందులో మూడు సినిమాలని బైలింగ్వల్ మూవీస్‌గా చేశారు. ఒక మూవీని తమిళ, కన్నడ, మరో మూవీని తమిళ, మలయాళంలో, మరో మూవీని తమిళ, తెలుగు భాషల్లో చేశారు. వీరిద్దరి కలయికలో చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్‌లే. 1976లో ప్రసిద్ధ లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ తెలుగులో చేసిన యూవీ `అంతులేని కథ`.
తమిళ మూవీ `అవల్ ఒరు తోడర్ కథై` ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. జయప్రద కీలక పాత్రలో నటించింది. రజనీ ఫుల్ లెంగ్త్ రోల్ చేయగా, కమల్ గెస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి అలరించారు. 1985లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి కమల్, రజనీ చేసిన మూవీ `గిరఫ్తార్`. దీని తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించలేదు. సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ వీరిద్దరు కలిసి భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీస్టారర్‌ని రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్‌పై యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చాలా ఏళ్ల విరామం తరువాత ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి చేస్తున్న సినిమా కాడంతో, అనౌన్స్‌మెంట్ వీడియోలోనే హీరో ఎవరు? అంటూ ఆసక్తిని రేకెత్తించడంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్, మేకర్స్ ఓల్డ్ ఫార్ములాని ఫాలో అవుతుండటం అందరిని ఆలోచింపజేస్తోంది. KH x RK అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ మేకింగ్ కోసం పాత పద్దతిలో ఫాలో అవుతున్నారు.
గతంలో ఫిల్మ్ మేకింగ్ రీల్స్‌లో ఉండేదన్నది తెలిసింది. ఇప్పుడు అంతా బీటాలు, చిప్‌లని వాడేస్తున్నారు. ఈ హైటెక్ యుగంలో డిజిటల్ పరికరాలని పక్కన పెట్టి సంప్రదాయ బద్దమైన రీల్ కెమెరాలతో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. 80, 90వ దశకంలో క్లాసిక్ సినిమాల మేకింగ్ ఇదే పద్దతిలో ఉండేది. ఇప్పుడు అలనాటి రోజులని గుర్తు చేస్తూ ఈ మూవీని ఆనాడు ఉపయోగించి క్లాసిక్ మేకింగ్‌లోనే రూపొందిస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఓల్డ్ మేకింగ్‌కి నివాళిగా మేకర్స్ ప్లాన్ చేశారట. ఇటీవల విడుదల చేసిన ప్రోమోని కూడా కెమెరామెన్ రాజీవ్ మీనన్ ఓల్డ్ కెమెరాల సహాయంతో షూట్ చేశారని తెలిసింది. కానీ ఫైనల్‌గా టైమ్ సరిపోక పోవడంతో నేటి తరం డిజిటల్ కెమెరాలే వాడాల్సి వచ్చిందట.
ఓల్డ్ ఫార్ములాని విజయవంతంగా ఈ సినిమా కోసం వాడగలిగితే ఆధునిక తమిళ సినిమాకు ఒక నాటి వింటేజ్ ఫిల్మ్ మేకింగ్‌ని తిరిగి తీసుకొచ్చినట్టే. అయితే ఇక్కడో చిక్కుంది. ఫిల్మ్ షూట్ వరకు ఓకే కానీ దాన్నిఎడిట్ చేసేవాళ్లు ఇప్పుడు ఉన్నారా? ..అంత క్వాలిటీ వస్తుందా? అది సాధ్యమేనా అన్నది ఇప్పుడు మిలిమన్ డాలర్ ప్రశ్నగా మారింది. మరి రాబోయే రోజుల్లో KH x RK టీమ్ ఓల్డ్ ఫార్మాట్ మేకింగ్‌తో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొంటుందన్నది వేచి చూడాల్సిందే.
