శ్రీనిధి చాలనుకుంటున్న గురూజీ..?
అంతేకాదు ఈమధ్య గురూజీ తన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ని పెడుతూ వస్తున్నాడు. మంచి ఇమేజ్ ఉన్న కథానాయికని సెకండ్ హీరోయిన్ ని చేసి ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నాడన్న టాక్ వచ్చింది.
By: Ramesh Boddu | 14 Nov 2025 7:00 PM ISTK.G.F బ్యూటీ శ్రీనిధి శెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటుంది. K.G.F 1 అండ్ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో అమ్మడు క్రేజ్ తెచ్చుకుంది. K.G.F తర్వాత చియాన్ విక్రం తో కోబ్రా సినిమా చేసిన ఈ బ్యూటీ ఆ సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేసింది. ఇక తెలుగులో మొదట సిద్ధు తెలుసు కదా సినిమా ఓకే చేసినా కూడా ఫస్ట్ రిలీజైంది మాత్రం నాని హిట్ 3. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రీనిధికి క్రేజ్ పెరిగింది. తెలుసు కదాలో కూడా తన రోల్ వరకు అదరగొట్టేసింది శ్రీనిధి.
టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ శ్రీనిధి..
వరుస సినిమాలతో టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ అయిన శ్రీనిధికి ఒక స్టార్ ఛాన్స్ ఖాతాలో చేరింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమాలో శ్రీనిధి ఫిమేల్ లీడ్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది అన్నది అనే దాని కన్నా శ్రీనిధికి ఈ లక్కీ ఛాన్స్ కచ్చితంగా టాలీవుడ్ లో ఆమె కెరీర్ ని స్ట్రాంగ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు ఆకట్టుకునేలా ఉంటాయి.
అంతేకాదు ఈమధ్య గురూజీ తన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ని పెడుతూ వస్తున్నాడు. మంచి ఇమేజ్ ఉన్న కథానాయికని సెకండ్ హీరోయిన్ ని చేసి ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నాడన్న టాక్ వచ్చింది. అందుకే వెంకటేష్ సినిమాలో శ్రీనిధి ఒక్కటే హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ని తీసుకోవట్లేదని టాక్. అలా అయితే గురూజీ సినిమా విషయంలో శ్రీనిధి చాలా లక్కీ అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఏరి కోరి శ్రీనిధినే ఎంపిక చేయడం ఎందుకు అన్నది సినిమాలో ఆమె పాత్ర చూసినప్పుడు తెలుస్తుందని అంటున్నారు.
త్రివిక్రమ్ తో పాటు ఇటు వెంకటేష్ కూడా..
త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ సినిమాలకు పనిచేశాడు. ఐతే అతను డైరెక్టర్ గా మారి చాలా ఏళ్లు అవుతున్నా ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది. అటు త్రివిక్రం తో పాటు ఇటు వెంకటేష్ కూడా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారని తెలుస్తుంది. 2026 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాతో మరోసారి అలాంటి బాక్సాఫీస్ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు.
ఈ సినిమాతో పాటు వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సంక్రాంతికి చిరు సినిమాలో వెంకీ సర్ ప్రైజ్ అదిరిపోతుందని అంటున్నారు.
