Begin typing your search above and press return to search.

కేజీఎఫ్- 3కి ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం..

ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   16 Oct 2025 5:00 PM IST
కేజీఎఫ్- 3కి ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం..
X

సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. హీరోగా అవతరించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న కన్నడ హీరో యష్.. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రం చేసి పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. 'కేజీఎఫ్ చాప్టర్ 1' అంటూ 2018లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 1981లో కోలార్ బంగారు గనులను ఆధారంగా చేసుకుని.. చాలా అద్భుతంగా కథను తయారు చేసి.. అంతే అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' విడుదలైన విషయం తెలిసిందే. 2019లో షూటింగ్ ప్రారంభమై.. 2022 ఏప్రిల్ 14న కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అంటూ పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను విడుదల చేశారు.


ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కే.జీ.ఎఫ్ చాప్టర్ 1 తో పోల్చుకుంటే కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.1250 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి.. 2022లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే కోవిడ్ 19 తర్వాత 4 వేల స్క్రీన్ లను దాటిన మొదటి చిత్రంగా పేరు దక్కించుకున్న ఈ సినిమా.. నైజాం ఏరియాలో మొదటి రోజు రూ.9.68 కోట్ల షేర్లు వసూలు చేసిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన డబ్బింగ్ చిత్రాలలో మొదటి చిత్రంగా నిలిచిన ఈ సినిమా.. అటు తమిళనాడులో కూడా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించింది.

అయితే అలాంటి సినిమాకు ఇప్పుడు మళ్లీ సీక్వెల్ రాబోతోందనే వార్త ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. విషయంలోకి వెళ్తే.. కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ లో చాప్టర్ 3 ఉంటుంది అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కేజిఎఫ్ చాప్టర్ 3 రాబోతోందని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు సడెన్ గా తుఫాన్ వచ్చి మీద పడినట్టు కేజీఎఫ్ చాప్టర్ 3 కి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..

విషయంలోకి వెళ్తే.. బుధవారం ప్రశాంత్ నీల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా రాబోతోంది అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది దీనిపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ నిజంగానే ఆయన అధికారిక ఖాతా నుంచి వచ్చిందా? లేక ఫేక్ అకౌంట్ ద్వారా వైరల్ చేస్తున్నారా? అనే చర్చ మొదలయ్యింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు కాబట్టి ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు అవాస్తవం కూడా అయి ఉండవచ్చు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్ తో సలార్ 2 సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక మధ్యలో మరో సినిమాను ప్రకటిస్తారా? లేక ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నేరుగా కేజిఎఫ్ చాప్టర్ 3ను సెట్ పైకి తీసుకెళ్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.