Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ నటుడు మృతి.. అందుకే చెప్పలేదు..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కేజీఎఫ్ 1 సినిమాలో హీరో యష్ కి ఛాఛా పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు హరీష్ రాయ్.

By:  Madhu Reddy   |   6 Nov 2025 7:57 PM IST
కేజీఎఫ్ నటుడు మృతి.. అందుకే చెప్పలేదు..
X

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. కేజీఎఫ్ 1 సినిమాలో హీరో యష్ కి ఛాఛా పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు హరీష్ రాయ్. ఖాసిం పాత్రలో గుబురు గడ్డంతో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. పలువురు ప్రముఖులు, అభిమానులు హరీష్ రాయ్ మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.

హరీష్ రాయ్ గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. కేజిఎఫ్ 1 చిత్రం తర్వాత ఊహించని ఇమేజ్ దక్కించుకున్న హరీష్ రాయ్.. కే జి ఎఫ్ 2 సినిమా విడుదలకు ముందే అంటే 2022లో తనకు గొంతు క్యాన్సర్ ఉందని తెలియజేశారు. అప్పట్నుంచి వ్యాధితో బాధపడుతున్న ఈయన.. ఆర్థిక సహాయాన్ని కోరాలని ఒక వీడియో కూడా షూట్ చేశారట. కానీ మొహమాటం కారణంగా ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు. అయితే ఈయన పరిస్థితి తెలుసుకున్న ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఈయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి మరీ ఆ వీడియోని తన సోషల్ మీడియా ఛానల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈయన పరిస్థితి చూసి అందరూ నిర్ఘాంత పోయారు. అందులో బక్క చిక్కిపోయి అనారోగ్య సమస్యలతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అప్పటికే క్యాన్సర్ ముదిరి నాలుగవ స్టేజ్ కి చేరుకుంది. ఆ వీడియోలో ఆయన స్పందిస్తూ.. తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని, ఎవరైనా దాతలు స్పందించి.. క్యాన్సర్ కు చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కన్నడ హీరో ధ్రువ సర్జ కొంతమేర ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. అలా వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు చికిత్స తీసుకున్న హరీష్ రాయ్ వ్యాధి ముదరడంతో తుది శ్వాస విడిచారు..

ఇకపోతే గతంలోనే ఈయనకు క్యాన్సర్ వ్యాధి ఉంది అని కానీ ఎందుకు చెప్పలేదు అనే విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ముందే గొంతు క్యాన్సర్ ఉంది. అందుకే కే జి ఎఫ్ సినిమాలో గొంతు బాగా వాచిపోవడంతోనే గుబురు గడ్డం పెట్టుకొని మేనేజ్ చేశాను. ఈ విషయాన్ని చెబితే మళ్ళీ సినిమాలలో అవకాశాలు రావని భావించి ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు అంటూ తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని దాచి పెట్టారు హరీష్ రాయ్. ప్రస్తుతం ఈయన మరణించారన్న వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హరీష్ రాయ్ కెరియర్ విషయానికొస్తే 1995లో వచ్చిన ఓం అనే చిత్రంలో డాన్ రాయ్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నల్ల అనే సినిమాలో కూడా విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.