Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ 3..య‌ష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌!

ఇక య‌ష్ గ‌త కొంత కాలంగా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఆ త‌రువాత షాక్ ఇస్తూ లేడీ డైరెక్ట‌ర్ తో `టాక్సిక్‌`ని మొద‌లు పెట్టారు.

By:  Ravindar Gorantla   |   21 April 2026 3:49 PM IST
కేజీఎఫ్ 3..య‌ష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌!
X

కేజీఎఫ్ చాప్ట‌ర్ 1, చాప్ట‌ర్ 2 చిత్రాలు పాన్ ఇండియా వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సిరీస్‌తో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసి స్టార్‌గా ఎదిగిన హీరో య‌ష్‌. అంత వ‌ర‌కు మినిమ‌మ్ బ‌డ్జెట్ చిత్రాల హీరోగా, క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన య‌ష్ ఈ సిరీస్ సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశ వ్యాప్తంగా స్టార్ డ‌మ్‌తో పాటు భారీ ఫాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. 2022లో విడుద‌లైన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించిన బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేసింది.

ఈ మూవీ త‌రువాత `కేజీఎఫ్ చాప్ట‌ర్ 3`ని మేక‌ర్స్ మూవీ లాస్ట్‌లో ప్ర‌క‌టించి సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశారు. అయితే సినిమా విడుద‌లై మూడేళ్ల‌కు పైనే అవుతున్నా దీని గురించి మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ విజ‌య్ కిర‌గందూర్ కానీ, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కానీ, హీరో య‌ష్ కానీ అప్ డేట్ ఇవ్వ‌లేదు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో `స‌లార్‌`ని చేశారు. అది పూర్త‌యి రిలీజ్ అయింది కూడా. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో `డ్రాగ‌న్‌` మూవీ చేస్తున్నారు.

ఇక య‌ష్ గ‌త కొంత కాలంగా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఆ త‌రువాత షాక్ ఇస్తూ లేడీ డైరెక్ట‌ర్ తో `టాక్సిక్‌`ని మొద‌లు పెట్టారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీనితో పాటు య‌ష్ `రామాయ‌ణ‌`లో రావ‌ణుడిగా న‌టిస్తూ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా నిర్మిస్తుండ‌టంతో య‌ష్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే య‌ష్ అభిమానులు `కేజీఎఫ్ 3`కి సంబంధించిన అప్ డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికైనా దీని గురించి టీమ్ అప్ డేట్ ఇస్తుంద‌ని వేచి చూస్తున్న అభిమానుల‌కు తాజాగా హీరో య‌ష్ షాక్ ఇచ్చారు. వ‌రుస ప్రాజెక్ట్‌ల‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల `కేజీఎఫ్ 3` ఇప్ప‌ట్లో క‌ష్ట‌మ‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. `టాక్సిక్‌` పూర్తి చేసిన య‌ష్ దీన్ని జూన్ 4న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌బోతున్నారు.

ఇక ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న `రామాయ‌ణ‌`లో య‌ష్ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తూనే రావ‌ణుడిగా న‌టిస్తుండ‌టం, రెండ‌వ భాగం షూటింగ్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డం, దాని రిలీజ్‌కు సంబంధించిన ప్ర‌యోష‌న్స్‌ని తానే ద‌గ్గ‌రుండి చూసుకోవాలి కాబ‌ట్టి `కేజీఎఫ్ 3`కి ఇప్ప‌ట్లో డేట్స్ కేటాయించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. `రామాయ‌ణ పార్ట్ 1` ఈ ఏడాది దీపావ‌ళికి రిలీజ్ కానుంది. ఆ త‌రువాత పార్ట్ 2ని వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్ చేస్తారు. ఇవ‌న్నీ పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఈ లోగా ప్ర‌శాంత్ నీల్ ..ఎన్టీఆర్ మూవీని పూర్తి చేసి ఫ్రీ అవుతాడు. అప్పుడే `కేజీఎఫ్ 3` గురించి ప్ర‌శాంత్ నీల్‌, య‌ష్ ఆలోచించే అవ‌కాశం ఉంది.