Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : రొమాంటిక్‌ బ్యూటీ అందాల షో

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి. అయినా కూడా ఈమె రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటుంది.

By:  Ramesh Palla   |   18 Aug 2025 7:00 AM IST
పిక్‌టాక్ : రొమాంటిక్‌ బ్యూటీ అందాల షో
X

ఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్‌' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈమె అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు సైతం చేయడం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఈమె చివరగా రాబిన్‌హుడ్‌లో ఐటెం సాంగ్‌లో కనిపించగా, సింగిల్‌ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో నటించింది. ఆ రెండు సినిమాల్లోనూ తన పాత్రకు మంచి పేరు వచ్చింది. కనుక ముందు ముందు మరిన్ని ఆఫర్లు వస్తాయని ఈ అమ్మడు ఆశ పడుతోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో కేతిక శర్మ అందాల ఫోటోలు

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి. అయినా కూడా ఈమె రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటుంది. అందుకు కారణం ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె షేర్‌ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందుకే ఈమె హీరోయిన్‌గా ముందు ముందు అయినా బిజీ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో టాలీవుడ్‌లో ఇప్పుడు కాకున్నా లక్ కలిసి వచ్చి ముందు ముందు అయినా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ కాకుండా పోతుందా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


క్లీ వేజ్‌ షో తో కేతిక శర్మ షో

కేతిక ఎప్పుడు ఫోటోలు షేర్‌ చేసినా ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈసారి చాలా సింపుల్‌ ఔట్‌ ఫిట్‌, పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా ఈ ఫోటోల నుంచి చూపు తిప్పలేక పోతున్నారు. ఇప్పటి వరకు ఈ అమ్మడు చేసిన సినిమాల విషయానికి వస్తే ఇంతకు మించి అందంగా కనిపించింది. అయినా కూడా ఈ ఫోటోల్లో చాలా చక్కగా, అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తూ ఉండే ప్రతి ఫోటో వైరల్‌ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ఫోటోలు సైతం ఆమె స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉన్నాయని, ఆమె క్లీ వేజ్‌ షో తో చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌తో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు లక్‌ ఉండాలని, అలా లేకుంటే కేతిక పరిస్థితి అందరికీ తప్పదని అంటారు.


పంజా వైష్ణవ్‌ తేజ్‌కి జోడీగా కేతిక శర్మ

1995లో ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ చదువు పూర్తి చేసిన వెంటనే మోడలింగ్‌ను తన కెరీర్‌గా ఎంపిక చేసుకుంది. అంతే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన యువతి అంటూ పేరు సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈమె మొదట్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసేంది. ఆ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. రీల్స్ చేయడం ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న కేతిక శర్మ లక్కీగా ఆకాష్ పూరి సినిమాలో ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఆ వెంటనే నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలోనూ ఈమె నటించింది. పంజా వైష్ణవ్‌ తేజ్‌తో రంగ రంగ వైభవంగా సినిమాను చేసింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా పవన్‌ కళ్యాణ్‌ బ్రో సినిమాలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే. అయినా ఈమెకు లక్‌ కలిసి రావడం లేదు.