షాక్ ఇచ్చిన కేతిక శర్మ.. సోషల్ మీడియాకి దూరం!
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వాడుక పెరిగిపోయిన తర్వాత నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు
By: Madhu Reddy | 29 Aug 2025 2:00 AM ISTసోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వాడుక పెరిగిపోయిన తర్వాత నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. అయితే ఏమైందో తెలియదు అప్పటి వరకూ ఆక్టివ్ గా ఉన్న వీరు సడన్ గా ఆ సోషల్ మీడియాకే బ్రేక్ ఇస్తూ అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి కూడా ఇలాగే సోషల్ మీడియాకు దూరమైంది. మళ్లీ వారం తర్వాత కం బ్యాక్ ఇచ్చి అభిమానులను ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా మరో హీరోయిన్ కూడా సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తున్నానని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు కేతిక శర్మ.. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు స్పెషల్ సాంగ్ లలో కూడా నర్తిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె సడన్ గా సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వబోతున్నాను అంటూ ప్రకటించి.. అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలోనే చాట్ జిపిటితో డిజైన్ చేసిన తన ఫోటోని షేర్ చేస్తూ.." సోషల్ మీడియా బ్రేక్" అనే క్యాప్షన్ తో ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మొదట కంగారుపడినా.. ఆ తర్వాత "విల్ బి బ్యాక్ సూన్" అంటూ త్వరలోనే మళ్లీ వస్తాను అని ఇచ్చిన క్యాప్షన్ చూసి సంతోష పడుతున్నారు. ప్రస్తుతం కేతికా శర్మ కొద్ది రోజులపాటు బ్రేక్ ఇవ్వనున్నాను అని చెప్పడంతో అసలేమైంది? ఎందుకు దూరం కాబోతోంది అంటూ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. మరి సోషల్ మీడియా బ్రేక్ వెనక అసలు నిజం ఏమిటో కేతికాశర్మ చెప్పేవరకు ఎదురుచూడాల్సిందే.
కేతిక శర్మ కెరియర్ విషయానికి వస్తే.. 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించిన ఈమె లక్నోలోని మార్టినీర్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివి, ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. చదువు పూర్తవగానే మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈమె.. దబ్ స్మాష్ వీడియోలు.. మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమా రంగంలోకి రాకముందే భారీ పాపులారిటీ అందుకుంది. 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కేతిక శర్మ.. అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ ప్లాట్ఫారం కోసం చేసిన ప్రోమోలో కనిపించింది.
'హాయే వే' అని మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించిన ఈమె లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి సినిమాలలో నటించింది.ఇక రాబిన్ హుడ్ సినిమాలో "అది దా సర్ప్రైజ్" అనే పాటలో స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం.
