Begin typing your search above and press return to search.

ఫిలిం అవార్డ్స్ 2025: ఉత్తమ నటుడిగా మెగాస్టార్..

సినిమా ఆర్టిస్టులు ఎంతగానో ఎదురు చూస్తున్న 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటన రామనాయకిలో ఘనంగా జరిగింది.

By:  Madhu Reddy   |   3 Nov 2025 7:37 PM IST
ఫిలిం అవార్డ్స్ 2025: ఉత్తమ నటుడిగా మెగాస్టార్..
X

సినిమా ఆర్టిస్టులు ఎంతగానో ఎదురు చూస్తున్న 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటన రామనాయకిలో ఘనంగా జరిగింది. మత్స్య, సంస్కృతి, యువజన సంక్షేమ శాఖ మంత్రి సాజీ చెరియన్ అధ్యక్షతన త్రిసూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ 2025 విజేతల జాబితాను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డు కోసం 128 చిత్రాలు నామినేట్ కాగా వీటిలో 26 చిత్రాలు లాస్ట్ రౌండ్లో షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. అందులో ఉత్తమమైనవి ఎంపిక చేశారు .

ముఖ్యంగా సెలక్షన్ కమిటీకి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్షత వహించగా.. ఆయన నేతృత్వంలో ఏడుగురు సభ్యుల జ్యూరీ ప్యానెల్ నాయకత్వం వహించింది. ఇకపోతే తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం.. ఎంపిక కమిటీ ప్రతి రోజు ఐదు చిత్రాలను ప్రదర్శించగా.. అందులో ప్రతి చిత్రం ప్రదర్శన తర్వాత విస్తృతమైన చర్యలు జరిపి ఉత్తమ రచనలు , ఉత్తమ కళాకారులు, ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది.

మరి ఈ ఏడాదికి గాను 55వ కేరళ ఫిలిమ్ స్టేట్ అవార్డ్స్ 2025 జాబితా విషయానికి వస్తే.. ఉత్తమ నటుడు కేటగిరీలో బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా కేరళ ఫిలిం స్టేట్ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఏడవసారి ఈ అవార్డు అందుకోవడం గమనార్హం. బ్రహ్మయుగం సినిమాకు ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇక మిగతా విజేతల జాబితా విషయానికి వస్తే..

ఉత్తమ చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్

ఉత్తమ ప్రజాధారణ పొందిన చిత్రం - ప్రేమలు

ఉత్తమ విఎఫ్ఎక్స్ - ARM

ఉత్తమ నటి : షమ్లా హంజా (ఫెమినిచి ఫాతిమా)

ఉత్తమ దర్శకుడు : చిదంబరం ఎస్ పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు (మేల్): సౌబిన్ షాహిర్, సిద్ధార్థ్ భరతన్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫిమేల్) : లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)

ఉత్తమ స్క్రీన్ ప్లే: చిదంబరం ఎస్ పొదువల్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ సంగీత దర్శకుడు : సుషీన్ శ్యామ్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ తెలుగు దర్శకుడు : ఫాసిల్ మొహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ సినిమా పుస్తకం : స్టార్ ఆక్రేసన్ (రచయిత సి మీనాక్షి)

ఉత్తమ కళా దర్శకుడు : అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ నేపథ్య గాయని : జెబా టామీ

ఉత్తమ గాయకుడు : కేఎస్ హరిశంకర్

ఉత్తమ కథా రచయిత : ప్రసన్న వితనగే (పారడైజ్)

ఉత్తమ సాహిత్యం : వేదన్ (మంజుమ్మెల్ బాయ్స్)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు: వైకోమ్ భాసి

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : సమీరా సనీష్

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : రోనెక్స్ జేవియర్

స్పెషల్ జ్యూరీ అవార్డు: పారడైజ్

స్పెషల్ జ్యూరీ అవార్డు : ఆసిఫ్ అలీ, టోవినో థామస్, దర్శన రాజేంద్రన్, జ్యోతిర్మయి.