Begin typing your search above and press return to search.

4 రోజుల్లో రూ.3.73 కోట్ల వసూళ్లు.. యూత్ మూవీకి సూపర్ రెస్పాన్స్!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన కోలీవుడ్ మూవీ యూత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

By:  M Prashanth   |   31 March 2026 4:45 PM IST
4 రోజుల్లో రూ.3.73 కోట్ల వసూళ్లు.. యూత్ మూవీకి సూపర్ రెస్పాన్స్!
X

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన కోలీవుడ్ మూవీ యూత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన తర్వాత రీసెంట్ గా తెలుగులో విడుదలైంది. ఈ2సీ టాకీస్ బ్యానర్‌ పై హౌస్ ఫుల్ వినీత్, సందీప్ ఆ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.




కెన్ కరునాస్ అండ్ టీమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా యూత్‌ ను మెయిన్ గా టార్గెట్ చేస్తూనే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను కూడా దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్‌ లో ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.

బాక్సాఫీస్ పరంగా కూడా యూత్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. చిన్న మూవీగా వచ్చినప్పటికీ, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో సినిమా సాలిడ్ కలెక్షన్లు సాధిస్తుందని చెప్పాలి. ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి మరింత మెరుగైన వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

సినిమాలో యూత్‌ కు కనెక్ట్ అయ్యే అంశాలు, కాలేజీ బ్యాక్‌ డ్రాప్, ఫ్రెండ్‌ షిప్, లవ్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కథలోని నేచురాలిటీ, పాత్రల ప్రదర్శన, కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అలాగే కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆ మూవీకి అదనపు బలం అందించాయి.

టెక్నికల్ పరంగా కూడా సినిమా మంచి మార్కులు సాధిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌ గా నిలుస్తోంది. పాటలతో పాటు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను మరింత ఎఫెక్టివ్‌ గా మార్చింది. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన వికి విజువల్స్‌ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఎడిటర్ నాష్ సినిమా నిడివి విషయంలో కీలక పాత్ర పోషించారు.

పార్వతా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందించగా.. ఆర్ట్ డైరెక్టర్ రాము తంగరాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ కావ్య శ్రీరామ్ తమ తమ విభాగాల్లో మెరుగైన పనితీరు చూపించారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ గా విజయ్ ఎంపీ కూడా ప్రాజెక్ట్‌ ను సక్సెస్ దిశగా నడిపించడంలో సహకరించారు. మొత్తానికి యూత్ సినిమా యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. రాబోయే రోజుల్లో మూవీ మరింత సాలిడ్ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.