Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ డైట్ మ్యాజిక్.. 10 కేజీలు తగ్గడం వెనుక సీక్రెట్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుంది. అలాంటి ఈమె తన ఫిట్‌నెస్ మరియు బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై సంచలన విషయాలను పంచుకున్నారు.

By:  Madhu Reddy   |   19 May 2026 5:00 AM IST
కీర్తి సురేష్ డైట్ మ్యాజిక్.. 10 కేజీలు తగ్గడం వెనుక సీక్రెట్!
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుంది. అలాంటి ఈమె తన ఫిట్‌నెస్ మరియు బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై సంచలన విషయాలను పంచుకున్నారు. గత కొంతకాలంగా ఆమె బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు, సర్జరీలంటూ ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో, వాటన్నిటికీ కీర్తి సురేష్ గట్టిగా సమాధానమిచ్చారు. తాను 9 నెలల్లో ఏకంగా 10 కేజీల బరువు ఎలా తగ్గిందో, ఆ డైట్ మ్యాజిక్ సీక్రెట్ ఏంటో ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది..

కీర్తి సురేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం మహానటి. ఆ సినిమా తర్వాత దొరికిన ఒక చిన్న బ్రేక్‌లో ఆమె తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై గట్టిగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పటివరకు వ్యాయామం అంటే పెద్దగా ఇష్టం లేని కీర్తి.. ఆ సమయంలో కఠినమైన వర్కౌట్ లు, డైట్ ప్లాన్స్‌తో సరికొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అలా తన ఫిట్‌నెస్ జర్నీలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

10 కేజీలు తగ్గించిన డైట్ మ్యాజిక్:

తాను బరువు తగ్గడం వెనుక ఎటువంటి సర్జరీలు లేవని, అంతా సహజంగానే జరిగిందని కీర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం ఆమె హై-ప్రోటీన్, లో-కార్బ్ డైట్‌ను పక్కాగా ఫాలో అయ్యారు. అంటే కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తగ్గించి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నారు. ఇక దీనితో పాటు హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ మరియు కార్డియో వర్కౌట్ లు చేస్తూ కేవలం 9 నెలల్లోనే 10 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సర్జరీ పుకార్లపై కీర్తి ఎమోషనల్:

కష్టపడి బరువు తగ్గితే జనాలు అభినందించాల్సింది పోయి, రకరకాల పుకార్లతో తనను చాలా బాధించారని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. "నేను కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు లావుగా ఉన్నానన్నారు.. సన్నబడిన తర్వాతేమో బలహీనంగా ఉన్నానంటూ, సర్జరీలు చేయించుకుందని ప్రచారం చేశారు. ఇక నా ముఖాన్ని, శరీరాన్ని నేను ఎప్పుడూ ఒకేలా నాచురల్ గా ఉంచుకోవడానికే ఇష్టపడతాను. జనాలు ఒకరు సన్నగా ఉంటే లావుగా అవ్వమంటారు, లావుగా ఉంటే సన్నబడమంటారు" అంటూ బాడీ షేమింగ్ చేసేవారిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

యోగా మరియు స్ట్రెంత్ ట్రైనింగ్ బ్యాలెన్స్:

ఒకప్పుడు వర్కౌట్ లను అస్సలు ఇష్టపడని కీర్తి సురేష్, ఇప్పుడు వాటిని తన లైఫ్‌లో ఒక ముఖ్య భాగం చేసుకున్నారు. ప్రస్తుతం తాను స్ట్రెంత్ ట్రైనింగ్ మరియు యోగా రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇక మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి ఈ లైఫ్‌స్టైల్ ఎంతో హెల్ప్ అవుతుందని, ఇప్పుడు వర్కవుట్లను అస్సలు వదిలిపెట్టలేకపోతున్నానని ఆమె సంతోషంగా పంచుకున్నారు.

సరికొత్త ఫిట్‌నెస్ మంత్రంతో, ఆరోగ్యకరమైన పద్ధతిలో 10 కేజీలు తగ్గి కీర్తి సురేష్ నిజమైన డైట్ మ్యాజిక్ ఏంటో చూపించారు. పుకార్లను నమ్మకుండా, పక్కా ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా అనుకున్న ఫిట్‌నెస్ గోల్స్ సాధించవచ్చని ఆమె నిరూపించారు. ఇక బాడీ షేమింగ్ చేసేవారి మాటలను పట్టించుకోకుండా, మన ఆరోగ్యం కోసం మనం మారడమే ముఖ్యమని చాటిచెప్పిన కీర్తి సురేష్ నిజంగా అందరికీ ఇన్‌స్పిరేషన్ అని చెప్పచ్చు..