Begin typing your search above and press return to search.

క్యూట్ స్టెప్స్ తో కాక పుట్టించిన రివాల్వ‌ర్ బ్యూటీ!

తాజాగా కీర్తిసురేష్ స్నేహితురాలి పెళ్లిలో చెల‌రేగింది. తాను హీరోయిన్ గా న‌టించిన `ద‌స‌రా` సినిమాలోని `చ‌మ్కీల అంగీలేసి` పాట‌కు మ‌రోసారి క్యూట్ స్టెప్ లు అందుకుంది.

By:  Srikanth Kontham   |   22 Dec 2025 6:56 PM IST
క్యూట్ స్టెప్స్ తో కాక పుట్టించిన రివాల్వ‌ర్ బ్యూటీ!
X

బాలీవుడ్ లో సెల‌బ్రిటీ ఇంట పెళ్లి అంటే? స్టార్లు అంతా క‌లిసి డాన్స్ చేయ‌డం అన్న‌ది ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది. రిసెప్ష‌న్ లో చిలౌట్ అవుతూ స్టెప్ అందుకోవ‌డం ఉత్త‌రాది తార‌లు ఓ క‌ల్చ‌ర్ లా భావిస్తుంటారు. సౌత్ లో ఇంత హంగామా ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. కుటుంబ స‌భ్యుల వివాహాల్లో...స్నేహితుల వివాహాల్లో సెల‌బ్రిటీలు భాగ‌మైతే గ‌నుక ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. పెళ్లిలో త‌మ‌దైన స్టెప్పుల‌తో వ‌చ్చిన అతిధుల్ని అల రిస్తున్నారు. సంథింగ్ స్పెష‌ల్ గా నిలుస్తున్నారు. ఆ మ‌ధ్య సాయి ప‌ల్ల‌వి సోద‌రి వివాహంలో ఎంత హంగామా చేసిందో తెలిసిందే.

త‌న పెళ్లికి చెల్లెలు స్టెప్పులు వేయడానికి బ‌ధులు చెల్లికి ముందుగా పెళ్లి చేసి ఆ వేడుక‌లో సాయి ప‌ల్ల‌వి చిందులే సిన వీడియో అప్ప‌ట్లో ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా కీర్తిసురేష్ స్నేహితురాలి పెళ్లిలో చెల‌రేగింది. తాను హీరోయిన్ గా న‌టించిన `ద‌స‌రా` సినిమాలోని `చ‌మ్కీల అంగీలేసి` పాట‌కు మ‌రోసారి క్యూట్ స్టెప్ లు అందుకుంది. సినిమాలో చీర క‌ట్టి డాన్సు ఆడిన బ్యూటీ వివాహ వేడుక‌లో మాత్రం స్లీవ్ లెస్ ఔట్ పిట్ లో అదే పాట‌కు డాన్సు చేసింది. స్టెప్స్ ఎక్క‌డా మిస్ మ్యాచ్ కాకుండా ఎంతో ర‌క్తిక‌ట్టించింది. చేతులు క‌దుపుతూ కాళ్లు ఆడిస్తూ ప‌ర్పెక్ట్ హిప్ మూవ్ మెంట్స్ ను దించేసింది.

దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజ‌నులు మ‌రోసారి ఫిదా అవుతున్నారు. `వెన్నెల మ‌ళ్లీ వ‌చ్చేసిం దంటూ` పోస్టులు పెడుతున్నారు. ప్రెండ్ పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుం దంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. ఇక కీర్తి సురేష్ సినిమాల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ ఏడాది అమ్మ‌డు కి నిరాశే ఎదురైంది. `ఉప్పుక‌ ప్పురంబు`, `రివాల్వ‌ర్ రీటా` సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

`రివాల్వ‌ర్ రీటా` కీర్తి న‌టించిన మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రం. ఈ సినిమా స‌క్సెస్ తో బౌన్స్ వ్యాక్ అవుతుంద నుకున్నారు? కానీ అంచ‌నాలు త‌ప్పాయి. `బేబి జాన్ `తో బాలీవుడ్ లో కూడా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. డెబ్యూ అక్క‌డా నిరాశ‌నే మిగిల్చింది. ప్ర‌స్తుతం మాలీవుడ్ లో మిన‌హా మ‌రే భాష‌లో సినిమాలు చేయ‌లేదు. మ‌రి కొత్త ఏడాది కొత్త అవ‌కాశాలు అందుకుంటుందా? అన్న‌ది చూడాలి.