Begin typing your search above and press return to search.

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

టాలీవుడ్ లో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పుడూ తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంటారు.

By:  Madhu Reddy   |   4 Nov 2026 4:00 PM IST
గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!
X

టాలీవుడ్ లో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పుడూ తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంటారు. తాజాగా ఆమె నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా షేర్ చేసిన వింటేజ్-ఇన్స్పైర్డ్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్‌లో కీర్తి ప్రదర్శించిన రాయల్ స్టైలింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..




రామ్ మంగో డిజైనర్ వేర్‌లో రాయల్ లుక్:

ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ఆధ్వర్యంలో కీర్తి సురేష్ ఈ స్టన్నింగ్ లుక్‌ను క్యారీ చేశారు. ప్రసిద్ధ లేబుల్ 'రామ్ మంగో' బ్రాండ్‌కు చెందిన స్లీక్ బ్లాక్ హై-నెక్ బ్లౌజ్, దానికి మ్యాచింగ్‌గా గోల్డెన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో కూడిన లాంగ్ ఫ్లోయింగ్ స్కర్ట్‌లో కీర్తి ఎంతో అందంగా మెరిసిపోయారు. దీనికి తోడు ఓపెన్ గోల్డెన్, ఆలివ్ జాకెట్ ఈ ఔట్‌ఫిట్‌కు మరింత ఎగ్‌టివ్ లుక్‌ను తెచ్చిపెట్టింది.




రౌండ్ సన్‌గ్లాసెస్, లాంగ్ బ్రెయిడ్ హైలైట్:

ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌కు తగినట్లుగానే ఆమె యాక్సెసరీస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. లుక్‌కి మరింత షార్ప్ ఎడ్జ్ తెచ్చేందుకు రౌండ్ సన్‌గ్లాసెస్ ధరించగా, అపలా బై సుమిత్ర బ్రాండ్‌కు చెందిన సున్నితమైన గోల్డ్ జ్యువెలరీ సాఫ్ట్ గ్లీమ్‌ను ఇచ్చింది. ఇక తేజి సింగ్ అందించిన లాంగ్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్, అఘా జైన్ చేసిన పర్ఫెక్ట్ మేకప్ ఈ వింటేజ్ స్టైల్‌ను ఎంతో పాలిష్డ్‌గా మార్చేశాయి.




నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న ‘అక్క’:

ఇక కీర్తి సురేష్, వర్సటైల్ నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ‘అక్క’ . 1980ల నాటి నేర సామ్రాజ్యం, గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో సాగే ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.




ఇక మొత్తానికి చూస్తే, "అక్క ఇన్ ఎ పరలల్ యూనివర్స్" అంటూ కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ వింటేజ్ ఫొటోషూట్ ఫ్యాషన్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒకవైపు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో డిఫరెంట్ జోనర్‌లో అలరిస్తూనే, మరోవైపు ట్రెండీ ఫ్యాషన్‌తో కీర్తి ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తున్నారు.