అరుంధతి, మహానటి సినిమాలు హిట్టే.. కానీ హీరోయిన్ల కెరీర్లో ఆ కష్టాలేంటి?
సినిమా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ సినిమా హీరో.. హీరోయిన్ల కెరీర్‌ను మార్చేస్తుందని చాలామంది అనుకుంటారు.
By: Priya Chowdhary Nuthalapti | 28 Oct 2026 4:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ సినిమా హీరో.. హీరోయిన్ల కెరీర్‌ను మార్చేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్క హిట్ సినిమా వచ్చినంత మాత్రాన హీరోయిన్ కెరీర్ బాగానే ఉంటుందని చెప్పలేం. బయట సాధారణంగా ఉద్యోగాల కోసం అందరూ ఎంతలా టెన్షన్ పడుతూ ఉంటారో.. సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ల సైతం అవకాశాల కోసం అంటే టెన్షన్ పడాలి ఏమో అన్న విషయం.. కీర్తి సురేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ వింటే అనిపిస్తుంది.
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు, ఆ సినిమా తర్వాత అవకాశాలే రాలేదంట. 2018లో విడుదలైన ‘మహానటి’ సినిమా దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటనకు గాను కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు.
ఒకరకంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించడం కన్నా జీవించింది అని చెప్పవచ్చు. కానీ అంత గొప్ప నతన తర్వాత అలానే అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా కీర్తి సురేష్‌కు ఊహించని పరిస్థితి ఎదురైంది. మహానటి విడుదలైన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు ఆమెకు కొత్త సినిమా అవకాశాలు రాలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.
మహానటి కంటే ముందు కీర్తి సురేష్ ఎక్కువగా సాధారణ యువతి పాత్రల్లో కనిపించేవారు. కానీ ఈ సినిమా తర్వాత ఆమెపై దర్శకుల అభిప్రాయం మారిపోయింది. అరుంధతి సినిమా తరువాత అనుష్కకు ఎలాంటి పరిస్థితిలు ఏర్పడ్డాయో ఒకరకంగా కీర్తి సురేష్ కి కూడా అలాంటి పరిస్థితులే మహానటి తర్వాత ఏర్పడ్డాయి.
2013 నుంచి 2018 వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని కీర్తి చెప్పారు. షూటింగ్, భోజనం, నిద్రతోనే తన రోజులు గడిచిపోయేవని తెలిపారు. అయితే, ఆరు నెలల విరామం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి, వ్యాయామం చేయడానికి ఉపయోగపడిందని చెప్పారు. అలాగే డబ్బును ఎలా నిర్వహించుకోవాలో కూడా నేర్చుకున్నానని వెల్లడించారు.
ఈ పరిణామాలు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎలా ఉంటాయో అర్థం అయ్యేలా చేస్తున్నాయి. ఒక బ్లాక్‌బస్టర్ తర్వాత హీరోలకు వరుస అవకాశాలు రావచ్చు. కానీ హీరోయిన్లకు మాత్రం మంచి సినిమా చేసినా సరైన పాత్రలు దొరుకుతాయనే గ్యారంటీ ఉండదు. మొత్తం మీద గొప్ప గొప్ప మహానటులకు కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్యారెంటీ లేదా అన్న అనుమానం అందరికీ వ్యక్తం అవుతుంది.
