Begin typing your search above and press return to search.

వెయిట్ ఉన్న రోల్ లో మహానటి..?

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమా తర్వాత సౌత్ లో తిరుగు లేని క్రేజ్ సంపాదించుకుంది.

By:  Ramesh Boddu   |   30 Dec 2025 9:30 AM IST
వెయిట్ ఉన్న రోల్ లో మహానటి..?
X

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమా తర్వాత సౌత్ లో తిరుగు లేని క్రేజ్ సంపాదించుకుంది. ఐతే ఆ తర్వాత అమ్మడు చేసిన సినిమాలు అంతగా క్లిక్ అవ్వలేదు. ఐతే తమిళ్ లో ఎలా ఉన్నా కూడా తెలుగులో కీర్తి సురేష్ చాలా వెనకపడింది. అమ్మడు చివరగా దసరాతో సూపర్ హిట్ అందుకోగా నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ తో డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు అందుకోలేని అమ్మడు ఫైనల్ గా రౌడీ జనార్ధన తో వస్తుంది.

రౌడీ జనార్ధనతో మొదటిసారి విజయ్ దేవరకొండతో..

ఐతే కీర్తి సురేష్ కి బలమైన పాత్ర పడితే చాలు అందులో ఆమె ప్రతిభ ఏంటన్నది చూపిస్తుంది. రౌడీ జనార్ధనతో మొదటిసారి విజయ్ దేవరకొండతో జత కడుతుంది కీర్తి సురేష్. ఐతే ఆమె నటించిన మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ నటించాడు కానీ అతనికి కీర్తి సురేష్ మధ్య సీన్స్ పడలేదు. ఐతే రౌడీ జనార్ధన సినిమాలో మాత్రం ఇద్దరు జత కడుతున్నారు.

రౌడీ జనార్ధన సినిమా నుంచి రీసెంట్ గా ఒక గ్లింప్స్ రిలీజైంది. అది చూసిన ఆడియన్స్ విజయ్ మాస్ విధ్వంసానికి సాక్ష్యులు అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఐతే ఈ సినిమాలో విజయ్ పాత్ర మాత్రమే కాదు రౌడీ హీరోయిన్ అదే కీర్తి సురేష్ పాత్ర కూడా చాలా వెయిట్ ఉండేలా డైరెక్టర్ రవి కిరణ్ కోలా ప్లాన్ చేశాడట. తనకు తగిన పాత్ర అభినయానికి స్కోప్ ఉన్న పాత్ర పడితే కీర్తి సురేష్ చెలరేగిపోతుంది. రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ కి దాదాపు ఇలాంటి పాత్ర పడిందని తెలుస్తుంది.

తెలుగులో మరో మైల్ స్టోన్ మూవీగా..

కీర్తి సురేష్ కి తెలుగులో మరో మైల్ స్టోన్ మూవీగా రౌడీ జనార్ధన్ అవుతుందని చెబుతున్నారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ చూస్తే హీరో హీరోయిన్ చిన్నప్పటి రిలేషన్ చూపించారు. గ్లింప్స్ ఒక ఫ్రేమ్ లో నీళ్లలో కీర్తి సురేష్ ఉన్నట్టు చూపించారు. సో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ఇద్దరు కూడా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీలో నటిస్తున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు ఈమధ్య అసలు టైం కలిసి రావట్లేదు. కింగ్ డం మీద ఎన్నో అంచనాలు పెట్టుకోగా అది కాస్త డిజప్పాయింట్ చేసింది. అందుకే రౌడీ జనార్ధన తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

కీర్తి సురేష్ నటిగా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఐతే దసరా తర్వాత తెలుగులో సరైన సినిమాలు పడని కీర్తి సురేష్ కి ఈసారి రౌడీ జనార్ధన లో కూడా బలమైన పాత్ర పడినట్టు తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం విజయ్ సపోర్ట్ తో కీర్తి సురేష్ కూడా అదరగొట్టేయడం పక్కా అని చెప్పొచ్చు.