సింగపూర్ క్రైమ్ లో ఇరుక్కున్న మహానటి
మహానటి బయోపిక్ లో నటించావు, ఇప్పుడు నీ బయోపిక్ సినిమాకు వద్దామని జగపతి బాబు అనగానే అయ్యో చాలా బయటపడిపోతాయని షాకయ్యారు కీర్తి.
By: Sravani Lakshmi Srungarapu | 9 Oct 2025 12:54 PM ISTనేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ను చూసి చాలా సైలెంట్ అనుకున్నారు. కానీ తర్వాత్తర్వాత ఆమె అల్లరి, ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసింది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గత దశాబ్ధ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న కీర్తి, రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
గ్లామర్ యాంగిల్ ను బయటపెట్టిన కీర్తి
బాలీవుడ్ కు వెళ్లకముందు గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్న కీర్తి, హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్లాక గ్లామర్ యాంగిల్ ను బయటపెట్టి, పెళ్లి తర్వాత కూడా ట్రెండీ కాస్ట్యూమ్స్ లో రచ్చ చేస్తోంది. అయితే కీర్తి తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో లో పాల్గొనగా, ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ప్రోమో చూస్తుంటే జగపతి బాబు, కీర్తి నుంచి చాలా విషయాలనే రాబట్టినట్టు తెలుస్తోంది.
దొంగతనం చేస్తే వచ్చే ఆనందమే వేరు
మహానటి బయోపిక్ లో నటించావు, ఇప్పుడు నీ బయోపిక్ సినిమాకు వద్దామని జగపతి బాబు అనగానే అయ్యో చాలా బయటపడిపోతాయని షాకయ్యారు కీర్తి. బయట నువ్వు పెద్ద మహానటివి అని జగపతి బాబు అంటే మీకు మాత్రం మహా నాటీ అంటూ సరదాగా చెప్పారు కీర్తి. చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవాళ్లా? దొంగతనం చేసేదానివా అని అడగ్గా, పాకెట్ మనీ దొంగతనం చేస్తే వచ్చే సంతోషమే వేరని చెప్పిన కీర్తి, సింగపూర్ లో ఏదో క్రైమ్ లో ఇరుక్కున్న విషయాన్ని జగపతి బాబు బయటపెట్టారు.
కీర్తి కి బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్..
నీకు బాషా ఫ్లాష్ బ్యాక్ ఉందట కదా? పోలీస్ స్టేషన్ వరకు వెళ్లొచ్చావ్ అని అడిగితే చాలా సార్లు వెళ్లాను అని నవ్వుతూ బదులిచ్చారు కీర్తి. ఇంత హ్యాండ్సమ్ గా ఎలా ఉన్నారని కీర్తి జగపతి బాబుని అడగ్గా ఇంతటి ఇన్సిపిరేషన్ ఎదురుగా ఉంది కదా అని జగపతి బాబు కొంటెగా సమాధానమిచ్చారు. కీర్తి చిన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ అనే విషయాన్ని బయటపెట్టిన జగ్గూ భాయ్, క్రికెట్ ఆడుతూ సిక్స్ కొడితే ఆంటోనీ క్యాచ్ పట్టుకున్నాడా అని సరదాగా అంటే, తనను క్యాచ్ పట్టుకున్నాడంటూ కీర్తి బదులిచ్చారు. అయితే ఇన్ని చేసిన అమ్మాయిని ఆంటోనీ ఎలా ప్రేమించాడు అని అడిగితే తన తెలివితో అని సమధానమిచ్చారు కీర్తి.
నెగిటివ్ రోల్ వస్తే తప్పక చేస్తా!
ఇదే ఎపిసోడ్ లో నెగిటివ్ రోల్ ఆఫర్ వస్తే చేస్తావా అని అడిగితే తప్పకుండా చేస్తానని బేస్ వాయిస్ తో చెప్తూ, నెగిటివ్ రోల్ కదా అలానే మాట్లాడాలని చెప్పారు కీర్తి. టాలీవుడ్ లో జెంటిల్‌మ్యాన్ ట్యాగ్ ఎవరికిస్తావని అడిగితే వెంటనే జగపతి బాబు పేరు చెప్పడంతో అందరూ బిస్కెట్స్ వేస్తే ఈమె మాత్రం ఏకంగా దోశలు వేస్తుందని జగపతి బాబు అన్నారు. కీర్తి పార్టిసిపేట్ చేసిన ప్రోమోనే ఈ రేంజ్ లో ఉండి, ఇన్ని విషయాలను బయటపెడితే ఇక ఫుల్ ఎపిసోడ్ లో ఎన్ని విషయాలు ప్రస్తావించారో తెలుసుకోవడానికి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
