ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినా కొత్త అవకాశాలు మాత్రం రాలేదు
మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక సక్సెస్ వస్తే ఆ తర్వాత ఆఫర్లు ఎలా క్యూ కడతాయో అందరికీ తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 24 Nov 2025 1:00 PM ISTమామూలుగా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక సక్సెస్ వస్తే ఆ తర్వాత ఆఫర్లు ఎలా క్యూ కడతాయో అందరికీ తెలిసిందే. కానీ ఓ స్టార్ హీరోయిన్ కు మాత్రం కెరీర్ బెస్ట్ మూవీ వచ్చాక కూడా ఆరేడు నెలల పాటూ ఎలాంటి కొత్త ఆఫర్లు రాలేదని చెప్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మలయాళ భామ కీర్తి సురేష్. ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ బయోపిక్స్ లో సావిత్రి జీవితంపై తీసిన మహానటి సినిమా కూడా ఒకటి.
సావిత్రితో నేషనల్ అవార్డు అందుకున్న మహానటి
ఆ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ లో ఎంతో గొప్ప యాక్టింగ్ చేసి ఆడియన్స్‌తో కన్నీళ్లు పెట్టించిన కీర్తి సురేష్ మహానటి మూవీలో యాక్టింగ్ కు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అప్పటివరకు సినిమాల సెలక్షన్ తో సతమతమవుతున్న కీర్తి సురేష్ కు మహానటి సినిమా కొత్త కెరీర్ ను అందించింది. ఈ సినిమాతో కీర్తి అందుకున్న సక్సెస్, క్రేజ్, నటిగా ఆమె పొందిన గుర్తింపు అంతా ఇంతా కాదు.
మహానటి తర్వాత ఖాళీ గా ఉన్న కీర్తి
సావిత్రి క్యారెక్టర్ లో జీవించి మెప్పించిన కీర్తి సురేష్ మహానటి తర్వాత వరుస ఛాన్సులతో బిజీగా ఉంటుందనుకుంటే తనకు ఓ వింత ఎక్స్‌పీరియెన్స్ ఎదురైనట్టు చెప్పారు. మహానటి తర్వాత తన లైఫ్ లో ఎదురైన పరిణామాల గురించి కీర్తి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహానటి తర్వాత ఇండస్ట్రీలో తన మీద అంచనాలు చాలా పెరిగాయని చెప్పారు కీర్తి.
ఆ సినిమా తర్వాత తనను స్పెషల్ క్యారెక్టర్లలోనే ఆడియన్స్ ఊహించుకున్నారని, అందుకే తనకు ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రాలేదని, దర్శకనిర్మాతలు కూడా తనను మహానటి లాంటి క్యారెక్టర్లలోనే ఊహించుకున్నారని, అందుకే తనకు కథలు, క్రియేటివ్ క్యారెక్టర్లు ఎక్కువగా రాలేదని, మహానటి రిలీజైన తర్వాత తనకు 6 నెలల పాటూ ఎలాంటి ఛాన్సులు రాలేదని కీర్తి చెప్పారు.
రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు రానున్న కీర్తి
ఆ ఆరు నెలల్లో తనకు ఎవరూ కథలు కూడా చెప్పలేదని, ఆ గ్యాప్ ను తాను మేకోవర్ కోసం వాడుకున్నట్టు చెప్పారు కీర్తి. కొంచెం టైమ్ తీసుకుని ఓపికగా వ్యవహరించాక కీర్తికి మళ్లీ ఛాన్సులు వచ్చి, స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారగా, కీర్తి నటించిన రివాల్వర్ రీటా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్నాళ్లుగా సినిమాల విషయంలో కాస్త బ్రేక్ తీసుకున్న కీర్తికి ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం కానుంది.
