ఎట్టకేలకు కీర్తి ఓకే చేసిందిగా!
పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు కీర్తి సురేష్.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 3:38 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీకి దూరమవకుండా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ గత కొద్ది కాలంగా కీర్తికి సరైన సక్సెస్ దక్కింది లేదు. రీసెంట్ గా కీర్తి నుంచి వచ్చిన సినిమాలేవీ ఆమెకు సక్సెస్ ను అందించలేదు. 2023 నుంచి కీర్తి సక్సెస్ కోసం పాకులాడుతూనే ఉన్నారు.
గ్యాప్ తీసుకుందా? వచ్చిందా?
పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు కీర్తి సురేష్. పెళ్లయ్యాక కీర్తి ఏ భాషలోనూ సినిమా చేసింది లేదు. మరి ఈ బ్రేక్ ను కీర్తి కావాలని తీసుకున్నారా లేక సరైన కథలు దొరక్క అలా గ్యాప్ వచ్చిందా అనేది తెలియదు కానీ కీర్తి సినిమాల కోసం మేకప్ వేసుకుని చాలా రోజులవుతుంది. అయితే ఇకపై ఆ గ్యాప్ ను పూరించాలనే ఆలోచనతో కీర్తి వరుస సినిమాలు చేయాలని డిసైడైనట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్నల్
అందులో భాగంగానే కీర్తి రీసెంట్ గా ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంచలన డైరెక్టర్, యాక్టర్ మిస్కిన్ తో కలిసి కీర్తి సురేష్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకు మిస్కిన్ కథ అందించడంతో పాటూ కీర్తితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. డిటెక్టివ్, పిశాచి లాంటి హిట్ సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించిన మిస్కిన్ రీసెంట్ గా డ్రాగన్ సినిమాలో ప్రొఫెసర్ గా నటించి మెప్పించారు.
ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది
కీర్తి సురేష్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కనుండగా, ఈ సినిమాకు ప్రవీణ్ విజయ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రొడక్షన్9 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్, జీ స్టూడియస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగ్గా, త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ అనౌన్స్ చేస్తూ తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమొచ్చిందంటూ రాసుకొచ్చారు. మొత్తానికి కీర్తి పెళ్లి తర్వాత వచ్చిన గ్యాప్ ను ఇన్నాళ్లకు బ్రేక్ చేశారన్నమాట.
