లవ్ సీక్రెట్ రివీల్ చేసిన కీర్తి సురేష్.. 15ఏళ్ల ప్రేమలో ఇన్ని ట్విస్టులా?
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన బ్యూటీ కీర్తి సురేష్.. ఈమె తల్లి మేనక కూడా హీరోయిన్ కావడంతో సినిమాల్లోకి రావడానికి కీర్తి సురేష్ పెద్దగా ఇబ్బందులు పడలేదు.
By: Madhu Reddy | 14 Oct 2025 11:14 AM ISTమహానటి సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన బ్యూటీ కీర్తి సురేష్.. ఈమె తల్లి మేనక కూడా హీరోయిన్ కావడంతో సినిమాల్లోకి రావడానికి కీర్తి సురేష్ పెద్దగా ఇబ్బందులు పడలేదు. అటు తండ్రి సురేష్ నిర్మాత జి.సురేష్ కుమార్. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలో కడుగు పెట్టిన ఈమె.. మలయాళంలో 'గీతాంజలి' మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'నేను శైలజా' మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత తెలుగులో ఈమె నటించిన దివంగత నటీమణి సావిత్రి బయోపిక్ 'మహానటి' ద్వారానే ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావడంతో.. కీర్తి సురేష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో భారీగా ఆఫర్స్ కూడా వచ్చాయి.
అయితే అలాంటి కీర్తి సురేష్ తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని తన ప్రేమ,పెళ్లి, కెరియర్ ఇలా ఎన్నో విషయాలను బయట పెట్టింది.అయితే కీర్తి సురేష్ దాదాపు 15 సంవత్సరాలు తన స్నేహితుడిని లవ్ చేసాను అని ఇప్పటికే పలుమార్లు చెప్పింది. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పింది. మతం వేరు కావడంతో పెళ్లికి కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు వచ్చి షోని సక్సెస్ చేస్తున్నారు. ఈ షోకి చాలామంది సెలబ్రిటీలు వచ్చి వాళ్ళ పర్సనల్, సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలు చెప్పడంతో చాలామంది ప్రేక్షకులు కూడా ఈ షోని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ షోకి కీర్తి సురేష్ వచ్చింది. ఈ షోలో కీర్తి సురేష్ తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. "నేను దాదాపు 15 సంవత్సరాలుగా ఆంటోని తట్టిల్ ని ప్రేమించాను. ఈ ప్రేమ విషయాన్ని మా వాళ్ళకి చెప్పాలంటే ముందు భయమేసింది. అందుకే చెప్పలేదు. అలా 2010 నుండి ఆంటోనీ తట్టిల్ తో పేరెంట్స్ కి తెలియకుండానే సీక్రెట్ గా డేటింగ్ చేశాను. అప్పుడే చెబుదాం అనుకున్నప్పటికీ ఇద్దరం ఇంకా కెరియర్ లో సెటిల్ కాకపోవడం వల్ల ఇప్పుడు చెప్పడం ఎందుకులే అని ఆగిపోయాం. లైఫ్ లో సెటిల్ అయ్యాకే ప్రేమ విషయాన్ని చెప్పాలని అనుకున్నాం.
కానీ పెళ్లికి నాలుగు సంవత్సరాల ముందే మా నాన్నకు చెప్పాను. అయితే మొదట్లో భయపడుకుంటూనే మా నాన్నకి నా ప్రేమ విషయం చెప్పాను. ఎందుకంటే మా ఇద్దరి మతాలు వేరువేరు కాబట్టి నాన్న ఏమంటారో అని భయపడ్డాను. కానీ నాన్న నా ప్రేమ విషయం చెప్పిన వెంటనే ఓకే చేశారు. ఆ సమయంలో ఆంటోని బిజినెస్ పనుల కోసం ఖతర్ లో ఉన్నారు. అందుకే ఆయన ఖతర్ నుండి తిరిగి రావడంతోనే మా పెళ్లి జరిగింది". అంటూ తన లవ్ స్టోరీ, పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఈ టాక్ షోలో బయటపెట్టింది. మొత్తానికైతే ఇది విన్న నెటిజన్స్ 15 ఏళ్ల ప్రేమ కథలో ఇన్ని ట్విస్టులా అంటూ కామెంట్లు చేస్తున్నారు..
అలాగే ఇదే షోలో జగపతిబాబుకి క్షమాపణలు కూడా చెప్పింది. ఎందుకంటే తన ప్రేమ విషయం తండ్రి కంటే ముందు జగపతి బాబుకే చెప్పిందట కీర్తి సురేష్.అలా ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మందికి మాత్రమే తన ప్రేమ విషయం తెలుసట. అలా తెలిసిన వారిలో జగపతిబాబు కూడా ఒకరు. అయినప్పటికీ తన పెళ్లికి జగపతిబాబుని ఆహ్వానించలేకపోయినందుకు కీర్తి సురేష్ ఆయనకి క్షమాపణలు చెప్పింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. రీసెంట్ గానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన్ అనే మూవీ లో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే జరిగాయి. ఈ సినిమా మాత్రమే కాకుండా తమిళంలో కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే బాలీవుడ్ లో అక్క అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో కీర్తితో పాటు రాధిక ఆప్టే కూడా నటిస్తోంది. అంతేకాదు తమిళంలో కన్నివేది అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
