Begin typing your search above and press return to search.

ఐటం గాళ్ల్ గా కీర్తి సురేష్ ఆ ఊపు స‌రిపోలేదా!

అయితే ఆ ప్రత్యేక పాటలో ఆమెలోని గ్లామర్ కోణాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో చిత్ర బృందం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   23 Oct 2026 6:20 PM IST
ఐటం గాళ్ల్ గా కీర్తి సురేష్ ఆ ఊపు స‌రిపోలేదా!
X

పరిశ్రమలో పద్ధతిగల పాత్రలు.. హోమ్లీ ఇమేజ్‌తో పక్కింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న న‌టి కీర్తి సురేష్ ఇటీవల రూట్ మార్చి గ్లామర్ బాట పట్టిన విషయం తెలిసిందే. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి `పారడైజ్` చిత్రంలో ఓ ప్రత్యేక ఐటమ్ సాంగ్‌లో మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల నుంచి ఒక్కసారిగా ఈ తరహా హై-వోల్టేజ్ డ్యాన్స్ నంబర్‌లోకి అడుగుపెట్టడం అమ్మ‌డి కెరీర్‌లోనే అతిపెద్ద ప్రయోగంగా మారింది. అయితే స్క్రీన్‌పై కీర్తి ఎంతగా క‌ష్ట‌ప‌డినా? ఐటమ్ సాంగ్‌కు ఉండాల్సిన అసలైన మాస్ కిక్ మాత్రం ఇందులో లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటమ్ భామగా మారడానికి కావలసిన గ్లామర్, గ్రేస్ కీర్తి సురేష్‌ లో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆ ప్రత్యేక పాటలో ఆమెలోని గ్లామర్ కోణాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో చిత్ర బృందం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కొరియోగ్రఫీ నుంచి కాస్ట్యూమ్ డిజైన్ వరకు ప్రతీది కొంత పరిమితంగానే కనిపించింది. ఐటమ్ సాంగ్ అనగానే ప్రేక్షకులు కోరుకునే పవర్ ఫుల్ ఎనర్జీ, థియేటర్లను ఊపేసే స్థాయిలో మాస్ అప్పీల్ పాటలో లోపించాయి. కీర్తి స్క్రీన్ ప్రెజెన్స్ ఆక‌ట్టుకున్నా? దాన్ని సరిగ్గా వాడుకోవడంలో మేకర్స్ వెనుకబడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సాధారణంగా ఐటమ్ సాంగ్స్ అనగానే బోల్డ్ కాన్సెప్ట్, గ్లామర్ డోస్, ఆకట్టుకునే మాస్ రెస్పాన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. కానీ కీర్తి సురేష్ ఈ పాటలో కూడా గ్లామర్ హద్దులను చాలా పరిమితంగానే ఉంచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాత ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ జాగ్రత్త పడ్డారో ? కీర్తి స్వయంగా ఆ పరిమితులు విధించుకుందో తెలియదు కానీ ఐటమ్ నంబర్‌కి కావలసినంత హీట్ మాత్రం స్క్రీన్‌పై పుట్టలేదు. సగం సగం ప్రయోగం వల్ల పాట చూడటానికి బాగున్నా? ఐటమ్ సాంగ్ అనిపించే స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయింది.

కీర్తి సురేష్ ప్రధాన బలం అమ్మ‌డికి ఉన్న‌ క్లాస్, పద్ధతిగల ఇమేజ్. అలాంటి నటి ఒక్కసారిగా ఐటమ్ భామగా మారినప్పుడు ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే మాస్ ఆడియన్స్ డిమాండ్ చేసే విజువల్స్ వేరుగా ఉంటాయి. `పారడైజ్` చిత్రంలో కీర్తి గ్లామర్ షో చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. పూర్తిస్థాయి మాస్ సాంగ్‌లో కనిపించాలనుకున్నప్పుడు పాత క్లాస్ ఇమేజ్‌ను పక్కనబెట్టి మరింత బోల్డ్ అడుగులు వేస్తేనే ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ వ‌స్తుంది.

సమంత, పూజా హెగ్డే వంటి అగ్ర కథానాయికలు స్పెషల్ సాంగ్స్ లో నటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వారు ఆ పాటలలో చూపించిన బోల్డ్‌నెస్, గ్లామర్ ప్రదర్శన ప్రేక్షకులకు పిచ్చెక్కించాయి. వారితో పోల్చి చూసినప్పుడు కీర్తి సురేష్ చేసిన ప్రయత్నం సాధారణంగానే అనిపిస్తుంది. భవిష్యత్తులో కీర్తి నిజంగానే గ్లామర్ రూట్‌లో ముందుకు వెళ్లాలనుకుంటే? మాత్రం గ్లామర్ డోస్‌ను మరింత పెంచక తప్పదు. అరకొర గ్లామర్‌తో ఐటమ్ నంబర్స్ చేస్తే అవి రొటీన్ పాటలుగానే మిగిలిపోతాయి.