హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!
సినిమా షూటింగ్స్‌లో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించారు. కొన్నిసార్లు నో చెప్పాలనుకున్నా, తన వల్ల సమస్యలు వస్తాయేమోనని వెనక్కి తగ్గాల్సి వచ్చేదని తెలిపారు. అయితే ఎవరినీ తప్పుపట్టకుండా తన అనుభవాలను మాత్రమే పంచుకోవడంతో కీర్తి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
By: Priya Chowdhary Nuthalapti | 9 Nov 2026 1:26 PM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే సమస్యలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వైరల్ అవుతున్నా. ఇటీవల జాన్వి కపూర్, రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి వారు మాట్లాడిన తీరు పలువురికి నచ్చలేదు. అయితే ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి మాట్లాడారు. కానీ ఆమె మాట్లాడిన విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈమధ్య జాన్వి కపూర్, రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ సౌత్ సినిమా షూటింగ్స్‌లో స్క్రిప్ట్, కెమెరా యాంగిల్స్ విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పుకువచ్చింది.. ఆ తరువాత రాధిక ఆప్టే కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో సౌత్ సినిమా ప్రేక్షకులు ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాంటి సమయంలో కీర్తి సురేష్ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. సినిమా షూటింగ్స్ సమయంలో కొన్నిసార్లు తాను అనుకున్నట్లు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయని ఆమె చెప్పారు.
కీర్తి మాట్లాడుతూ, "నా మనసు ఏం చెబితే నేను అదే చేస్తాను. ఒక సమయంలో చాలా సినిమాలకు నో చెప్పాను. కానీ కొన్నిసార్లు షూటింగ్ స్పాట్లో కొన్ని పనులు జరుగుతున్నప్పుడు, నేను నో చెబితే నా వల్ల సమస్యలు వస్తాయేమో అనిపించేది. అలాంటి పరిస్థితులు నాకు ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తాయి. సినిమా ఇండస్ట్రీ బయట ఉండి ఇలాంటి విషయాలు చెప్పడం చాలా సులభం. కానీ ఇండస్ట్రీలో ఉండి వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నిజానికి సినిమా షూటింగ్స్‌లో హీరోయిన్లు కూడా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. తమకు నచ్చని విషయాలను కూడా కొన్ని సందర్భాల్లో అంగీకరించాల్సి వస్తుంది. అలాంటి సమస్యల గురించి మాట్లాడటంలో తప్పు లేదు.
అయితే కీర్తి సురేష్ తన సమస్యలను చెబుతూనే ఏ ఒక్క దర్శకుడిని, నిర్మాతను లేదా సినిమా ఇండస్ట్రీని తప్పుపట్టలేదు. తనకు ఎదురైన అనుభవాల గురించి మాత్రమే మాట్లాడారు. జాన్వి, రాధిక వ్యాఖ్యలతో పోలిస్తే కీర్తి మాట్లాడిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ అదే సమయంలో హీరోయిన్ లకు మాత్రమే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.. హీరోలు ఎందుకు ఎటువంటి సమస్యలు చెప్పడం లేదు అనేది కూడా చాలా మందిలో ఉన్న సందేహం. ఎందుకంటే స్క్రిప్ట్ విషయంలో హీరోయిన్లకు సమస్య ఉంటే ఆ సమస్య హీరోలకి కూడా ఉండాలి. హీరోయిన్ కి ఒకలాగా హీరోకి ఒకలాగా ఎందుకు ఉంటుంది అనే అవమానం కూడా చాలామందిలో వస్తోంది.
