Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్.. ఇది ఊహించలేదుగా!

తన అప్ కమింగ్ మూవీ రివాల్వర్ రీటా ప్రమోషన్స్ లో భాగంగా.. ఎల్లో కలర్ లో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేశారు కీర్తి సురేష్.

By:  M Prashanth   |   25 Nov 2025 11:12 PM IST
కీర్తి సురేష్.. ఇది ఊహించలేదుగా!
X

స్టార్ హీరోయిన్, ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం, అభినయంతో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న అమ్మడు బ్యూటీనెస్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎంతో మంది మదిని దోచుకున్న బ్యూటీకి టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు బాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.





అయితే సోషల్ మీడియాలో కీర్తి సురేష్ యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులు పెడుతుంటారు. నయా ఫోటో షూట్ ను షేర్ చేసే అమ్మడు.. రీసెంట్ గా ఊహించని లుక్ లో కనిపించారు. ట్రెండీ డ్రెస్ లో దిగిన పిక్స్ ను షేర్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి.





తన అప్ కమింగ్ మూవీ రివాల్వర్ రీటా ప్రమోషన్స్ లో భాగంగా.. ఎల్లో కలర్ లో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేశారు కీర్తి సురేష్. దీంతో పిక్స్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మేడమ్ అదరిపోయాయి పిక్స్ అంటూ సందడి చేస్తున్నారు. క్యాప్షన్ కూడా బాగుందని సినీ ప్రియులు చెబుతున్నారు.

మోడ్రన్ లుక్ వావ్ అనిపించేలా ఉందని అంటున్నారు. అయితే రీటా రివాల్వర్ మూవీతో కీర్తి సురేష్.. మరికొద్ది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనున్నారు. నవంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతున్న ఆ సినిమా.. యాక్షన్ & కామెడీ కథతో రూపొందుతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

అదే సమయంలో తెలుగులో అనేక సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న అమ్మడు.. ఇప్పుడు చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో సందడి చేయనున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో వర్క్ చేస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న రౌడీ జనార్ధన్ మూవీలో విజయ్ సరసన ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ సినిమాను నిర్మిస్తుండగా.. ఆయన నిర్మాణంలో మరో మూవీలో కూడా కీర్తి యాక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. బలగం మూవీతో సూపర్ హిట్ అందుకున్న వేణు ఎల్దండి డైరెక్ట్ చేయనున్న ఎల్లమ్మ సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆ సినిమాపై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి అప్ కమింగ్ మూవీస్ తో కీర్తి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.