హీరోయిన్ల నిర్ణయాల్లో కో స్టార్ల కీలక పాత్ర?
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఎల్లమ్మ చుట్టూ తాజాగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 18 March 2026 5:00 PM ISTతెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఎల్లమ్మ చుట్టూ తాజాగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డైరెక్టర్ వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కాస్టింగ్ మార్పులు, అనూహ్య నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్ గా కీర్తి అని వార్తలు
మొదటగా ఈ సినిమాలో హీరోగా నటించేందుకు పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. ఈ ప్రాజెక్టు ముందు నాని, నితిన్ వద్దకు వెళ్లింది. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల ఎల్లమ్మ ను వారు చేయలేకపోయారు. ఈ మూవీలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ కూడా ఎంపికైందని అప్పట్లో టాక్ వినిపించింది కానీ కానీ, పరిస్థితులు ఒక్కసారిగా మారాయి.
కాస్టింగ్ డైనమిక్స్ ను మార్చేసిన దేవీ శ్రీ
అయితే ఎల్లమ్మ ప్రాజెక్ట్‌లో కీలక మలుపు తీసుకొచ్చింది మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ ఎంట్రీనే. ఆయన ఈ సినిమాలో హీరోగా నటించనున్నట్లు వార్తలు రావడంతో, కాస్టింగ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, డీఎస్పీ హీరోగా ఉండే పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి కీర్తి సురేష్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆమె ఈ విషయాన్ని నిర్మాతలకు మర్యాదపూర్వకంగా తెలియజేసినట్టు సమాచారం.
ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై ఇండస్ట్రీలో చర్చలు జోరందుకున్నాయి. ఒకవైపు ఇది పూర్తిగా ప్రొఫెషనల్ కాల్ మాత్రమేనని కొందరు భావిస్తుండగా, మరికొందరు మాత్రం స్టార్ హీరోలతో పని చేసే అవకాశాలను ప్రాధాన్యతగా చూసే ట్రెండ్‌కు ఇది ఉదాహరణగా చూపుతున్నారు. ముఖ్యంగా, కంటెంట్ బలంగా ఉన్నప్పటికీ కో-స్టార్ ఎంపిక కూడా హీరోయిన్‌ల నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంకా ఫైనలైజ్ అవని హీరోయిన్
మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కూడా ఇంకా ఫైనల్ అవలేదు. ప్రస్తుతం సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ పాత్రకు బలమైన నటన అవసరం ఉండటంతో, మేకర్స్ తొందరపడకుండా సరైన ఎంపిక కోసం సమయం తీసుకుంటున్నారు. కథలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, ఇది సాధారణ కమర్షియల్ ఎంపిక కాకుండా, పెర్ఫార్మెన్స్‌ను మోయగల హీరోయిన్ ను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు దేవీ ప్రయత్నాలు
మరోవైపు, దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం ఈ సినిమాను తన కెరీర్‌లో కొత్త అధ్యాయంగా భావిస్తూ, నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి లీడ్ హీరోగా మారడం చిన్న విషయం కాదు. ఈ మార్పు సక్సెస్ అయితే, ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కూడా లీడ్ రోల్స్‌లో కనిపించే కొత్త ట్రెండ్‌కు ఇది నాంది కావొచ్చు. మొత్తమ్మీద ఎల్లమ్మ ఇప్పుడు కేవలం ఒక సినిమా కాకుండా, కంటెంట్ వర్సెస్ స్టార్ పవర్, కాస్టింగ్ ఎంపికలు, ఇండస్ట్రీ డైనమిక్స్ లాంటి పలు అంశాలపై చర్చకు కేంద్రబిందువుగా మారింది.
