Begin typing your search above and press return to search.

కంగనా తరహాలో కీర్తి సురేష్ బిగ్ డ్రీమ్

సాధారణంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ పెళ్లి తర్వాత స్లో అవుతుందని అంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ సెంటిమెంట్ కి చెక్ పెట్టేసింది.

By:  M Prashanth   |   22 Nov 2025 2:00 AM IST
కంగనా తరహాలో కీర్తి సురేష్ బిగ్ డ్రీమ్
X

సాధారణంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ పెళ్లి తర్వాత స్లో అవుతుందని అంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ సెంటిమెంట్ కి చెక్ పెట్టేసింది. పెళ్లి తర్వాత ఆమె మరింత జోరుగా దూసుకెళ్తోంది. 'రివాల్వర్ రీటా' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి, తన మనసులో ఉన్న ఒక 'బిగ్ డ్రీమ్' గురించి ఓపెన్ అయ్యింది. అది కేవలం నటనకు సంబంధించినది కాదు, సినిమా మేకింగ్ కి సంబంధించిన ఒక పెద్ద కల. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కీర్తి సురేష్ తన ఇంటర్వ్యూలో క్యాజువల్ గా చెప్పిన ఒక మాట ఏమిటంటే.. ఆమె సొంతంగా ఒక స్క్రిప్ట్ రాసుకుంటోందట. అవును, కీర్తికి డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉందట. కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోకుండా, ఒక క్రియేటర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఆమె బలంగా కోరుకుంటోంది. ఇది నిజమైతే, కంగనా రనౌత్ లాగా కీర్తి కూడా 'లేడీ డైరెక్టర్' గా మెగాఫోన్ పట్టుకునే రోజు ఎంతో దూరంలో లేదు.

యాక్టింగ్ చేస్తూనే డైరెక్షన్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. అజయ్ దేవగన్, కంగనా లాంటి కొద్దిమంది మాత్రమే ఈ ఫీట్ ని సక్సెస్ ఫుల్ గా చేయగలిగారు. ఇప్పుడు కీర్తి కూడా ఆ లిస్ట్ లో చేరాలని చూస్తోంది. ఇది ఆమెలోని మల్టీ టాలెంటెడ్ యాంగిల్ ని చూపిస్తోంది. 'మహానటి'గా సావిత్రి గారి బయోపిక్ లో నటించి మెప్పించిన కీర్తి, ఇప్పుడు నిజ జీవితంలో కూడా సావిత్రి గారిలా డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుండటం యాదృచ్ఛికమే అయినా ఆసక్తికరంగా ఉంది.

ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, తన భర్త సినిమాలకు దూరంగా ఉంటారని క్లారిటీ ఇచ్చింది. "ఆయన సినిమాల జోలికే రారు, నాతో నటించే ప్రసక్తే లేదు" అని నవ్వేసింది. ఇది చూస్తుంటే కీర్తి తన ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎంత బ్యాలెన్స్డ్ గా మైంటైన్ చేస్తుందో అర్థమవుతోంది. భర్త సపోర్ట్ ఉన్నా, తన కెరీర్ ని తన సొంత కాళ్ల మీదే నిలబెట్టుకోవాలనే తపన ఆమెలో కనిపిస్తోంది.

మరోవైపు మహిళల భద్రత గురించి కీర్తి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. తనకి, సమంతకి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో క్లిప్ చూసి తాను ఎంతలా భయపడ్డానో చెప్పుకొచ్చింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, సెలబ్రిటీలకే కాదు సామాన్య మహిళలకు కూడా రక్షణ కరువవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్నంత కఠిన చట్టాలు ఇక్కడ కూడా రావాలని ఆమె కోరుకుంది.