Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ సినిమా బ్యాన్.. అక్కడ నో ఎంట్రీ

కానీ ఆయన లేటెస్ట్ మూవీ ‘డోరతి’ విషయంలో ఆ మలుపులే ఇప్పుడు సినిమాను మించి హాట్ టాపిక్ గా మారాయి.

By:  M Prashanth   |   28 Sept 2026 11:03 AM IST
కీర్తి సురేష్ సినిమా బ్యాన్.. అక్కడ నో ఎంట్రీ
X

కార్తిక్ సుబ్బరాజ్ సినిమా అంటేనే అందులో ఊహించని ట్విస్టులు ఉంటాయని ఆడియన్స్ ముందే ఫిక్స్ అవుతారు. కానీ ఆయన లేటెస్ట్ మూవీ ‘డోరతి’ విషయంలో ఆ మలుపులే ఇప్పుడు సినిమాను మించి హాట్ టాపిక్ గా మారాయి. చిన్ననాటి స్నేహితులు, జెండర్ ఐడెంటిటీ, కీర్తి సురేష్ క్యారెక్టర్.. అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రాకరకల అభిప్రాయాలు ట్రెండ్ అవుతున్నాయి.

బోల్డ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచే ఒక బజ్ క్రియేట్ చేస్తోంది. ఇండియాలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో అడల్ట్ డోస్ గట్టిగానే ఉందన్న సంగతి జనాలకు ముందే తెలుసు. కథ తీసుకున్న బోల్డ్ టర్న్ చూసి ఒక వర్గం ఆడియన్స్ షాక్ అవుతుంటే, ఇంకో వర్గం మాత్రం డైరెక్టర్ గట్స్ ను మెచ్చుకుంటోంది. ఇండియాలో ఈ డివైడ్ టాక్ నడుస్తుండగానే, ఇప్పుడు ఓవర్సీస్ నుంచి వచ్చిన ఒక ఊహించని న్యూస్ డోరతి చుట్టూ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

మలేషియాలో డోరతి సినిమా థియేట్రికల్ రిలీజ్ కు అక్కడి సెన్సార్ అధికారులు బ్రేకులు వేశారు. స్క్రీనింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అక్కడ ప్లాన్ చేసిన రిలీజ్ మొత్తం ఆగిపోయింది. సినిమాలో ఉన్న ఎల్జీబీటీక్యూ (LGBTQ) రిలేషన్స్, మితిమీరిన బోల్డ్ సన్నివేశాలే ఈ నిషేధానికి ప్రధాన కారణమని ఇన్‌సైడ్ టాక్. అయితే కచ్చితంగా ఏ సీన్ల వల్ల అబ్జెక్షన్ వచ్చిందనే దానిపై మలేషియా అధికారులు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా బ్యాన్ చేసేశారు.

అసలు డోరతి కథ మొదలయ్యేది ఒక క్రైమ్, ఫ్యామిలీ, స్నేహం చుట్టూ. కానీ కథ సాగుతున్న కొద్దీ ఒక క్యారెక్టర్ తన జెండర్ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ ఇంకో రూపం తీసుకోవడం మెయిన్ ప్లాట్ గా మారుతుంది. ఇందులో కీర్తి సురేష్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, ఆమెకు సంబంధించిన ఒక బోల్డ్ సీన్ మాత్రం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఎలిమెంట్స్ వల్లే మలేషియాలో అడ్డంకులు వచ్చాయంటున్నారు.

ఇండియా, మలేషియా సెన్సార్ నిర్ణయాల మధ్య ఉన్న కంట్రాస్ట్ ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇండియాలో కేవలం పెద్దలకు మాత్రమే అంటూ 'A' సర్టిఫికెట్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలేషియాలో మాత్రం కొన్ని సీన్స్ కట్ చేసి రిలీజ్ కు అవకాశం ఇచ్చారా లేక డైరెక్ట్ గా సినిమాకే నో చెప్పారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అఫీషియల్ లెటర్ బయటకు రాకపోయినా, బ్యాన్ అనే మాట మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ భారీగా నిర్మించిన ఈ సినిమాలో సనత్ కుమార్, రిషికాంత్ రాజేంద్రన్ మెయిన్ లీడ్స్ గా నటించారు. సెప్టెంబర్ 25న ఇండియాలో రిలీజైన ఈ డార్క్ థ్రిల్లర్, ఇప్పుడు మరిన్ని భాషల్లో రిలీజ్ కావడానికి టార్గెట్ చేస్తోంది. ఇక సినిమా రానున్న రోజుల్లో ఇంకెలాంటి కామెంట్స్ అందుకుంటుందో చూడాలి.