కళావతి మరో లేడీ ఓరియేటెడ్ చిత్రం!
కీర్తి సురేష్ అలియాస్ కళావతి పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
By: Srikanth Kontham | 6 Sept 2025 11:00 PM ISTకీర్తి సురేష్ అలియాస్ కళావతి పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. వచ్చిన ఏ అవకాశం కాదనకుండా కమిట్ అవుతుంది. ఓవైపు కమర్శియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ అదే దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం తమిళ్ లో 'రివాల్వర్ రీటా'లో నటిస్తోంది. ఇందులో అమ్మడు పవర్ పుల్ పాత్రలో కనిపించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి కమిట్ అయింది. కోలీవుడ్ లో తెరకెక్కనున్న ఓ కోర్టు రూమ్ డ్రామాలో ప్రధాన పాత్రకు కీర్తి ఎంపికైంది.
ప్రవీణ్ ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి గత చిత్రాలను చూసి ప్రవీణ్ ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సినిమాలో స్లార్ డైరెక్టర్ మిస్కిన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రమ్ స్టిక్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తీర్పు వెలువరించలేం గానీ, మలుపులు మాత్రం కచ్చితంగా ఉంటాయంటూ సదరు సంస్థ ప్రకటించింది. ఇందులో కీర్తి మహిళా న్యాయవాది పాత్ర పోషిస్తుంది. మహిళా నటీమణుతో కోర్ట్ రూమ్ డ్రామా ఈ మధ్య కాలంలో తెరకెక్కలేదు. నవతరం భామలంతా కమర్శియల్ చిత్రాల వైపు చూసించిన ఆసక్తి ఈ తరహా కథల వైపు చూపించడం లేదు.
స్టార్ హీరోయిన్లు ఇలాంటి పవర్ పుల్ పాత్రలు పోషిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నా? ఆ ఛాన్స్ మాత్రం దర్శక, నిర్మాతలు కూడా తీసుకోవడం లేదు. దీంతో పేరున్న నాయికలు కొన్ని బలమైన పాత్ర లకు దూరమవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ తమిళ్ డైరెక్టర్ ఈ తరహా కథాంశంతో రావడం విశేషం. 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత చేసిన ఉమెన్ సెంట్రింక్ చిత్రాలేవి ఆశీంచిన ఫలితాలు సాధించలేదు. 'పెన్గున్', 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖీ', 'రఘుతాత' లాంటి చిత్రాలేవి కీర్తి కెరీర్ కి పెద్దగా కలిసి రాలేదు.
అయినా కీర్తికి ఆ తరహా అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. కథలు నచ్చితే కమిట్ మెంట్ గా పని చేస్తోంది. 'రివాల్వర్ రీటా' కూడా అలా కుదిరిన ప్రాజెక్ట్. ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇదే ఏడాది అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ చేయనున్నారు. ఆ చిత్రం రిలీజ్ కంటే ముందే మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి సైన్ చేయడం విశేషం.
