గ్లామర్ వర్క్ అవుట్ కాలేదని ఈసారి అలా..?
మహానటి కీర్తి సురేష్ సౌత్ లో తన ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉన్నా కూడా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ఒక అటెంప్ట్ చేసింది.
By: Ramesh Boddu | 23 Nov 2025 7:00 AM ISTమహానటి కీర్తి సురేష్ సౌత్ లో తన ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉన్నా కూడా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ఒక అటెంప్ట్ చేసింది. బేబీ జాన్ అంటూ అమ్మడు చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ కాలేదు. సౌత్ లో చాలా క్లీన్ ఇమేజ్ తో ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించిన కీర్తి సురేష్ ఒక్కసారి బాలీవుడ్ నీళ్లు పడ్డాయో లేదో థై షోస్ తో అదరగొట్టేసింది. కీర్తి సురేష్ సౌత్ లో ఇన్ని సినిమాలు చేసినా కూడా చేయని గ్లామర్ షో బేబీ జాన్ లో గుమ్మరించేసింది. ఐతే అదంతా బీ టౌన్ ఆడియన్స్ మెప్పు కోసమే అని తెలుస్తున్నా కూడా అమ్మడు ఈ రేంజ్ గ్లామర్ షో అయితే ఆమె ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు.
బేబీ జాన్ కి బిఫోర్ రిలీజ్ మంచి బజ్..
ఐతే గ్లామర్ షో వల్ల బేబీ జాన్ కి బిఫోర్ రిలీజ్ మంచి బజ్ వచ్చినా సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్ల రిజల్ట్ రివర్స్ అయ్యింది. ఐతే నెక్స్ట్ గ్లామర్ షో కాకుండా ఈసారి కీర్తి సురేష్ ఒక మంచి సినిమాతో మరో ప్రయత్నం చేస్తుంది. అదే శిక్షక్. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాను ఆదిత్య నింబల్కర్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో టానియా మనిక్తల కూడా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఐతే కీర్తి సురేష్ కి సౌత్ లో మంచి నటీమణిగా పేరు ఉంది. అలాంటి పాత్రలో హిందీలో కూడా అదరగొట్టేస్తుంది. బేబీ జాన్ తో తప్పు జరిగినా ఈసారి రాబోతున్న సినిమాల విషయంలో మాత్రం అమ్మడు అసలు తప్పు చేయకూడదు అనుకుంటుంది. ఈ క్రమంలోనే అమ్మడు శిక్షక్ ఛాన్స్ అందుకుంది.
విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన్..
ఇక అమ్మడి తెలుగు సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ నెక్స్ట్ ఎల్లమ్మ సినిమాలో కూడా కథానాయికగా నటిస్తుందన్న టాక్ ఉంది. వేణు యెల్దండి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఎల్లమ్మ సినిమా ఫైనల్ కాస్టింగ్ పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కీర్తి సురేష్ కి ఆ ఛాన్స్ వస్తే మాత్రం మరోసారి అవార్డ్ గ్యారెంటీ అనేలా స్క్రిప్ట్ ఉందని తెలుస్తుంది.
కీర్తి సురేష్ కూడా మళ్లీ టాలీవుడ్ లో గ్రిప్ సాధించేందుకు అమ్మడు గురి పెట్టింది. రాబోతున్న రెండు సినిమాలు తప్పకుండా తెలుగులో మళ్లీ కీర్తి సురేష్ ని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేస్తాయన్న టాక్ ఉంది. అటు బాలీవుడ్ లో కూడా తన ప్రయత్నాలను ఆపట్లేదు కీర్తి సురేష్.
