Begin typing your search above and press return to search.

మహానటి భుజాల మీద రివాల్వర్ రీటా రిస్క్..!

ఐతే కీర్తి సురేష్ రివాల్వర్ రీటా అనే సినిమా చేసింది. జే కే చంద్రు డైరెక్షన్ లో తెరకెక్కిన రివాల్వర్ రీటా సినిమా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

By:  Ramesh Boddu   |   14 Nov 2025 1:24 PM IST
మహానటి భుజాల మీద రివాల్వర్ రీటా రిస్క్..!
X

మహానటితో నేషనల్ అవార్డ్ సైతం సంపాధించుకున్న కీర్తి సురేష్ సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఐతే తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది అమ్మడు. ఐతే అవేవి కీర్తి సురేష్ కి సక్సెస్ అందించలేదు. తెలుగులో అయితే దసరా హిట్ పడగా భోళా శంకర్ రూపంలో ఫ్లాప్ షాక్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ కీర్తి సురేష్ అటు బాలీవుడ్ వైపు కూడా తొలి అడుగు వేయగా బేబీ జాన్ సక్సెస్ అవుతుందని అనుకుంటే ఆ సినిమా కూడా రిజల్ట్ షాక్ ఇచ్చింది.

కీర్తి సురేష్ రివాల్వర్ రీటా..

ఐతే ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ బలగం వేణు ఎల్లమ్మ సినిమాలో కూడా నటిస్తుందని టాక్. ఐతే ఎల్లమ్మ గురించి ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఐతే కీర్తి సురేష్ రివాల్వర్ రీటా అనే సినిమా చేసింది. జే కే చంద్రు డైరెక్షన్ లో తెరకెక్కిన రివాల్వర్ రీటా సినిమా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ నెల 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

రివాల్వర్ రీటా సినిమా ట్రైలర్ చూస్తే ఇదొక కామెడీ విత్ యాక్షన్ సినిమాగా వస్తుంది. ఐతే సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తున్నా స్క్రీన్ ప్లే మీదే రిజల్ట్ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఐతే రివాల్వర్ రీటా సినిమా మొత్తం కీర్తి సురేష్ భుజాన వేసుకుని చేసింది. సినిమాలో సెల్లింగ్ పాయింట్ కీర్తి మాత్రమే.. ఐతే ఆమె రోల్ ఇంకా సినిమా ఎంగేజ్ అయితే వర్క్ అవుట్ అవుతుంది. ఒకవేళ అలా కాకపోతే రిస్క్ లో పడినట్టే అవుతుంది.

పెళ్లి తర్వాత కొంత గ్యాప్..

కీర్తి సురేష్ కెరీర్ లో ఈమధ్య వరుస ఫ్లాపులు పడ్డాయి. అటు పెళ్లి తర్వాత సినిమాల పరంగా అమ్మడు కొంత గ్యాప్ కూడా తీసుకుంది. సో రివాల్వర్ రీటా సినిమా అమ్మడికి కెరీర్ లో జోష్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. కీర్తి సురేష్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ మీద నమ్మకంతో ఉంది. ఇదే కాదు తెలుగులో రాబోతున్న సినిమాల మీద కూడా కీర్తి సురేష్ మంచి హైప్ ఎక్కిస్తుంది. సో ఈ సినిమాలు వర్క్ అవుట్ అయితే మాత్రం తప్పకుండా అమ్మడి కెరీర్ కి మళ్లీ మంచి ఉత్సాహం వచ్చే ఛాన్స్ ఉంటుంది.

కమర్షియల్ సినిమాలతో పాటు కీర్తి సురేష్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఐతే ఆ సినిమాల రిలీజ్ విషయంలో లేట్ ప్రాజెక్ట్ మీద ఉన్న ఆసక్తిని కూడా పోగొట్టేలా చేస్తుంది. రివాల్వర్ రీటా రిలీజ్ కి ఆలస్యం ఏంటన్నది తెలియదు కానీ ఈ టైం లో అమ్మడు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. కీర్తి సురేష్ మాత్రం నెక్స్ట్ సినిమాలతో అయినా ప్రేక్షకులను మెప్పించాలని చూస్తుంది.