Begin typing your search above and press return to search.

చిరు కన్నా విజయ్ డ్యాన్స్ బాగుంటుందా? కీర్తి ఏం చెప్పిందంటే?

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఇప్పుడు రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   27 Nov 2025 9:45 AM IST
చిరు కన్నా విజయ్ డ్యాన్స్ బాగుంటుందా? కీర్తి ఏం చెప్పిందంటే?
X

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఇప్పుడు రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందిన ఆ సినిమా.. మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. దీంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అమ్మడు.. ఇప్పటికే తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సారీ చెప్పారు. అసలేమైందంటే?

గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, విజయ్‌ లలో మెరుగైన డ్యాన్సర్‌ ను ఎంచుకోమని కీర్తిని హోస్ట్ అడిగారు. అప్పుడు ఆమె విజయ్ సార్ తన అభిమాన డ్యాన్సర్ అని చెప్పారు. దీంతో కీర్తిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. చిరును అవమానించారని అనేక మంది నెటిజన్లు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. విమర్శలు కూడా చేశారు.

ఇప్పుడు ఆ విషయాన్ని తాజా ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి.. కీర్తి వద్ద ప్రస్తావించారు. అప్పుడు మెగా అభిమానులు మండిపడ్డారని, ఎందుకు అలా చెప్పారని అన్నారు. నిజంగానే చిరంజీవి కంటే విజయ్ మెరుగ్గా డ్యాన్స్ చేస్తారా అంటూ రిపోర్టర్ క్వశ్చన్ చేశారు. దీంతో ఎవరు మెరుగ్గా కనిపిస్తారు అనేదాని గురించి కాదంటూ కీర్తి సురేష్ వివరణ ఇచ్చారు.

తాను విజయ్ సర్ కు ఎంత పెద్ద ఫ్యానో చిరంజీవి సర్ కు కూడా తెలుసని అన్నారు. "నాకు మెగాస్టార్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం నాకు పెద్ద గౌరవం. ఆయనతో ఎప్పుడూ పలు విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఒకవేళ చిరు ఫ్యాన్స్ ఫీల్ అయితే దయచేసి నన్ను క్షమించండి" అని కీర్తి సురేష్ చెప్పారు.

ఆ తర్వాత ఎవరితో నటించడానికి ఇష్టపడతానో లేదా ఎవరి డ్యాన్స్ ఇష్టపడతాననే విషయంపై చిరు సర్ తో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు. తనకు విజయ్ సర్ డ్యాన్స్, సూర్య సర్ అంటే ఇష్టమని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ విషయాలను మెగాస్టార్ సర్ దాన్ని చాలా స్పోర్టివ్‌ గా తీసుకున్నారని వెల్లడించారు కీర్తి.

"ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. చిరంజీవి సర్, విజయ్ సర్ గొప్ప నటులు. మా అమ్మ (నటి మేనక) మెగాస్టార్ గారితో కలిసి యాక్ట్ చేశారు. ఆయన దేశంలో అతి పెద్ద స్టార్లలో ఒకరు" అంటూ వివరణ ఇచ్చారు. అయినా మళ్లీ సదరు రిపోర్టర్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. దీంతో "చిరంజీవి ఒక మెగాస్టార్, ఒక లెజెండ్ అని అందరికీ తెలుసు. కానీ విజయ్ సర్ అక్కడ ఒక లెజెండ్. ఏదైనా అది నా వ్యక్తిగత అభిప్రాయం" అంటూ కీర్తి స్టేట్మెంట్ ఇచ్చారు.