Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఫ్లాప్ అయినా పోయిందేం లేదు : కీర్తి సురేష్‌

సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్‌, ఒక ఫ్లాప్ మొత్తం కెరీర్‌ను మార్చడం మనం చూస్తూ ఉంటాం.

By:  Ramesh Palla   |   27 Oct 2026 11:11 AM IST
ఆ సినిమా ఫ్లాప్ అయినా పోయిందేం లేదు : కీర్తి సురేష్‌
X

సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్‌, ఒక ఫ్లాప్ మొత్తం కెరీర్‌ను మార్చడం మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు చాలా సినిమాలు చేసి హిట్‌ కొట్టి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న హీరో లేదా హీరోయిన్‌ లేదా దర్శకుడు ఒక్క ఫ్లాప్‌తో కనిపించకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు వరుస ఫ్లాప్స్ పడుతున్నా ఒక్క హిట్‌తో ఎక్కడికో వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే ఫ్లాప్‌ పడితే ఆ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్‌ నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ కొందరు హీరోయిన్స్‌కి మొదటి సినిమాతో ఫ్లాప్‌ పడ్డా లక్కీగా వరుసగా ఆఫర్లు పడ్డాయి. తెలుగులో శ్రీలీల మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఇంకా కొందరు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే జాబితాలో కీర్తి సురేష్‌ నిలిచింది. బాలీవుడ్‌లో ఈమె మొదటి సినిమా 'బేబీ జాన్‌' ఫ్లాప్‌ అయింది. అయినా కూడా ఆ సినిమా వల్ల బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయని కీర్తి సురేష్‌ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ మూవీ బేబీ జాన్‌తో...

కీర్తి సురేష్ ఇటీవల ఒక చిట్‌ చాట్‌ లో తన బాలీవుడ్‌ ఎంట్రీ మూవీ బేబీ జాన్‌ గురించి మాట్లాడుతూ ఏమాత్రం అసంతృప్తి లేదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో అవకాశం రాగానే చాలా సంతోషపడ్డాను, కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా నాకు పోయిందేం లేదు, ఆ సినిమాలో నా నటనను మెచ్చి బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి. బేబీ జాన్‌ ఫ్లాప్‌ అయినప్పటికీ రాజ్‌కుమార్‌ రావుతో కలిసి రఫ్తార్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇంకా పలు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు వచ్చాయి. కనుక బేబీ జాన్‌ ఫ్లాప్‌ అయినంత మాత్రాన నాకు ఏదో నష్టం జరిగిపోలేదని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. తమిళ్‌లోనూ నాకు ఫ్లాప్‌ పడ్డ సమయంలో ఆ సినిమాలోని నటన చూసి 'మహానటి' సినిమాలో నాగ్‌ అశ్విన్‌ గారు ఛాన్స్ ఇచ్చారని కీర్తి సురేష్ కొత్త లాజిక్‌ను, చాలా పాజిటివ్‌గా చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కీర్తి సురేష్‌ కి ఫ్లాప్ పడ్డప్పటికీ...

ఫ్లాప్‌ పడ్డప్పుడు నిరుత్సాహ పడకుండా పాజిటివ్‌తో ముందుకు సాగాలి అని కీర్తి సురేష్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె చాలా పాజిటివ్‌గా తన ఫ్లాప్స్‌ ను ఒప్పుకుంటుంది. బేబీ జాన్‌ ఫ్లాప్‌ అయినా బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ ఫ్లాప్‌ వల్ల నాకు జరిగిన నష్టం ఏమీ లేదని చెప్పడం ద్వారా ఆమె ఎంత పాజిటివ్‌ మైండ్‌తో ఉంటుందో అర్థం అవుతుంది. అంతే కాకుండా ఆమె తమిళ్‌ మూవీ తొడరి సైతం తీవ్రంగా నిరాశ పరిచింది. కానీ ఆ సినిమాలోని తన యాక్టింగ్‌ నచ్చడం వల్లే మహానటి సినిమాకు నాగ్ అశ్విన్‌ ఎంపిక చేశాడని చెప్పడం జరిగింది. మొత్తానికి కీర్తి సురేష్‌ తనకు పడ్డ ఫ్లాప్స్‌ను సైతం చాలా పాజిటివ్‌ నోడ్‌ లో తీసుకుని, కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తుంది. అందుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌ వరకు తన సత్తా చాటుతూ వెళ్లింది.

జనవరి 12 విడుదల సినిమాతో కీర్తి సురేష్‌...

ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో విజయ్‌ దేవరకొండతో కలిసి రౌడీ జనార్ధన సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. తెలుగులో కాస్త గ్యాప్‌ తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాతో రాబోతుంది. ఇక హిందీలో ఈమె చాలా ఆశలు పెట్టుకుని నటించిన రఫ్తార్‌ సినిమా సైతం ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ రాఫ్తార్‌ సినిమా విడుదలైన తర్వాత మాత్రమే కొత్త సినిమాకు సైన్ చేయాలని భావిస్తుందట. ఇక తమిళ్‌లో ఈమె మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో మొదటగా సత్యవాన్‌ సావిత్రి సినిమా విడుదల కాబోతుంది. ఇక వచ్చే సంక్రాంతికి వెంకటేష్‌తో కలిసి 'జనవరి 12 విడుదల' సినిమాతో రాబోతుంది. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ చాలా బిజీ బిజీగా సినిమాలు చేస్తోంది. మునుపటితో పోల్చితే పెళ్లి తర్వాత మరింత జోష్‌ మీద కీర్తి సురేష్ సినిమాలు చేస్తుంది.