16.. 17 ఏళ్ల వయసులోనే... కీర్తి మహా ముదురు గురూ..!
ఈతరం ప్రేక్షకులకు మహానటి సావిత్రిని వెండి తెరపై చూపించే అవకాశం యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ దక్కించుకుంది.
By: Ramesh Palla | 26 Nov 2025 2:00 PM ISTఈతరం ప్రేక్షకులకు మహానటి సావిత్రిని వెండి తెరపై చూపించే అవకాశం యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ దక్కించుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ మొత్తం మారి పోయింది. ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ అప్పుడప్పుడు బాలీవుడ్ ఇతర భాషల సినిమాల్లోనూ కీర్తి సురేష్ నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడు తన చిరకాల ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి కొన్ని నెలలకు జరగబోతుంది అనే వరకు కూడా కీర్తి సురేష్ లవ్ వ్యవహారం ఏ ఒక్కరికీ తెలియదు. కానీ ఆమె ఆంటోనీతో ఏకంగా 15 ఏళ్లుగా రిలేషన్‌లో ఉంది. ఆ విషయాన్ని పెళ్లి సమయంలో స్వయంగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తమ ప్రేమకు సంబంధించిన విషయాలను మెల్ల మెల్లగా రివీల్ చేస్తూ వస్తోంది.
కీర్తి సురేష్ ప్రేమ కథ...
ఇటీవల ఒక సందర్భంగా కీర్తి సురేష్ తన ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చింది. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ కథ తమది అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కాలేజ్ రోజుల్లో తాను ఆంటోనీతో ప్రేమలో పడ్డట్లుగా పేర్కొంది. ఆన్ లైన్ ద్వారా ఆంటోనీ పరిచయం అయ్యాడు అంది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ రాకముందు ఆర్కుట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉండేది. ఈ జనరేషన్ వారికి అది తెలియక పోవచ్చు. ఆ సమయంలో ఆర్కుట్ చాలా ఫేమస్ అయ్యింది. అందులో స్నేహితులు అయ్యేవారు. అలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆంటోనీతో కీర్తి సురేష్ కి ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఇద్దరు ఆన్ లైన్ ద్వారా స్నేహం మొదలు పెట్టి, చాటింగ్ చేసుకునేవారట. నెల రోజుల పాటు చాటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొచ్చిన్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఆంటోనీని కీర్తి సురేష్ చూడటం జరిగిందట.
కీర్తి సురేష్, ఆంటోనీ ప్రేమ పెళ్లి...
ఆ సమయంలో కీర్తి సురేష్ ఫ్యామిలీ తో ఉండటం తో మాట్లాడటం వీలు పడలేదట. కానీ ఆ సమయంలో ఆంటోనీ దృష్టిలో పడే విధంగా కీర్తి సురేష్ కన్ను కొట్టిందట. అప్పుడు ఆంటోనీ ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుందని షాక్ అయ్యాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక మాల్‌లో మేము ఇద్దరం కలిశాం. అప్పుడే మాటల మధ్యలో నీకు గట్స్ ఉంటే నాకు ప్రపోజ్ చేయి అంటూ రెచ్చగొట్టాను. అలా అంటే ఏ అబ్బాయి అయినా ఊరుకుంటాడా... ఆంటోనీ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పుడు నేను అతడిని బలవంత పెట్టి లవ్ ప్రపోజల్ చేయించినట్లు అనిపించింది అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన ప్రవర్తన గురించి ఇప్పుడు ఆలోచిస్తే నవ్వు వస్తుందని కీర్తి సురేష్ సరదాగా వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఆంటోనితో ప్రేమ మొదలైంది అన్నట్లుగా తన ప్రేమ కథను కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
ఆర్కుట్‌లో పరిచయం, ఆన్‌లైన్ లో చాటింగ్
ఆర్కుట్ రోజుల్లో అంటే 2005 నుంచి 2008 మధ్య కాలం అయ్యి ఉంటుంది. ప్రస్తుత కీర్తి సురేష్ వయసును బట్టి చూస్తే అప్పుడు కేవలం 16 లేదా 17 ఏళ్లు ఉండి ఉంటాయి. మహా అయితే 18 ఏళ్లు అయ్యి ఉంటుంది. అంత చిన్న వయసులోనే కీర్తి సురేష్ చాలా డేర్‌గా ఒక అబ్బాయిని మాల్‌లో పట్టుకుని రెచ్చగొట్టి మరీ అతడితో ప్రపోజ్ చేయించింది అంటే మామూలు విషయం కాదు. కీర్తి సురేష్ మహా ముదురు అని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది అంటూ కొందరు సోషల్ మీడియాలో అప్పుడే లెక్కలు వేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కెరీర్‌లో సెటిల్ కావడం కోసం ప్రేమ విషయాన్ని బయటకు రాకుండా, వెంటనే పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. 15 ఏళ్లు వీరి ప్రేమ బంధం కొనసాగిందంటే వీరు కచ్చితంగా జీవితాంతం చాలా సంతోషంగా వైవాహిక జీవితాన్ని సాగిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
