Begin typing your search above and press return to search.

ఆ విషయం మర్చిపోతే ఎలా డ్యూడ్..?

ఐతే దీనికి రెస్పాండ్ అయిన కీర్తీశ్వరన్ నీ పని నువ్వు చూసుకో అంటూ వ్యగ్యంగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ చాటింగ్ ని అతను సోషల్ మీడియాలో షేర్ చేసి కొత్త దర్శకుడు విమర్శలు తీసుకోలేకపోతున్నాడంటూ పోస్ట్ చేశాడు.

By:  Ramesh Boddu   |   23 Nov 2025 10:44 AM IST
ఆ విషయం మర్చిపోతే ఎలా డ్యూడ్..?
X

సినిమాను తీయడం వరకే మేకర్స్ వంతు అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఐతే సినిమాపై విమర్శ, ప్రతి విమర్శలు కామన్. ఒక సినిమాకు రివ్యూస్ అనేవి రెగ్యులర్ అయ్యాయి. ఒకప్పుడు ఇవి సినిమా రిలీజైన వారం తర్వాత వస్తే ఇప్పుడు సినిమా చూస్తూ ట్వీట్ తోనే టాక్ చెప్పేస్తున్నారు. ఐతే ఆడియన్స్, రివ్యూయర్స్, ఇన్ ఫ్లూయెన్సర్స్ ఎవరైనా ఒక సినిమా గురించి ఒక రివ్యూ ఇస్తే దాన్ని దర్శకులు కచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. రివ్యూ అనేది అవతల వ్యక్తి యాంగిల్ లో ఉంటుంది కాబట్టి అది సినిమా క్రియేటర్ కి నచ్చకపోవచ్చు కానీ దానికే అతని మీద రివర్స్ పంచ్ వేయాల్సిన అవసరం లేదు.

షాక్ అయ్యేలా కీర్తీశ్వరన్ కామెంట్స్..

డైరెక్టర్ గా సినిమాని మెచ్చుకునే వారు ఎలా ఉంటారో.. నచ్చని వారు కూడా కామెంట్ చేస్తారన్న విషయం అర్థం చేసుకోవాలి. లేటెస్ట్ గా డ్యూడ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ పై ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ చేసిన కామెంట్స్ కి అతను ఇచ్చిన రెస్పాన్స్ షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ ఇన్ ఫ్లూయెన్సర్ ఏమన్నాడంటే డ్యూడ్ సినిమాలో మమితా మోకాళ్ల మీద హీరో ప్రేమను అడిగే సీన్ ఫ్రెండ్ షిప్ లో అది సాధారణం అన్నట్టుగా చూపించారు. కానీ అది అలా జరగదు. అంతేకాదు చెత్త రీల్స్ అన్నీ కలిపి సినిమా చేశావు అంటూ డైరెక్టర్ కి ట్యాగ్ చేశాడు.

ఐతే దీనికి రెస్పాండ్ అయిన కీర్తీశ్వరన్ నీ పని నువ్వు చూసుకో అంటూ వ్యగ్యంగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ చాటింగ్ ని అతను సోషల్ మీడియాలో షేర్ చేసి కొత్త దర్శకుడు విమర్శలు తీసుకోలేకపోతున్నాడంటూ పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజెన్లు కూడా కీర్తీశ్వరన్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే డైరెక్టర్ తీసిన సినిమా మీద ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు చేస్తుంటారు. దాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకుని విమర్శించిన వారితోనే సూపర్ అనిపించేలా చేసుకోవాలి.

ప్రతి డైరెక్టర్ ని ఏదో ఒక విధంగా కార్నర్..

అలా కాకుండా నీ పని నువ్వు చూసుకో లాంటి కామెంట్స్ డైరెక్టర్ పరిణితిని తెలిసేలా చేస్తాయి. అఫ్కోర్స్ సినిమా తీయడం కష్టమే.. తీసిన ప్రతి డైరెక్టర్ ని ఏదో ఒక విధంగా కార్నర్ చేస్తారు. కానీ తను తీసిన సినిమా గురించి కీర్తీశ్వరన్ ఎక్స్ ప్లైన్ చేస్తే సరిపోతుంది కదా లేదా మరో విధంగా చెబితే బెటర్ గా ఉంటుంది కదా అని చెప్పుకుంటున్నారు.

సో డ్యూడ్ సినిమా తీసిన ఈ డ్యూడ్ నెటిజెన్ల కామెంట్స్ ని పాజిటివ్ గా తీసుకోవాలే తప్ప వారిపై తన ప్రతాపం చూపిస్తానంటే రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని కీర్తీశ్వరన్ ఈ సినిమాకే కాదు నెక్స్ట్ సినిమాలకు కూడా మర్చిపోకపోతే బెటర్ అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు.