కీర్తి సురేష్ భర్త సినిమా అంటే లగెత్తడమే!
మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీలో ఛాన్సులందుకుంటూ బిజీగా ఉంది.
By: Srikanth Kontham | 21 Nov 2025 3:00 PM ISTమలయాళ బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీలో ఛాన్సులందుకుంటూ బిజీగా ఉంది. ఈ మధ్య టాలీవుడ్ కంటే బాలీవుడ్ పై దృష్టిపెట్టి పని చేస్తోంది. నటిగా అక్కడ బిజీ అవ్వాలని సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఓ సినిమా కూడా చేసింది. కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. అలాగే వెబ్ సిరీస్ ల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. కెరీర్ పరంగా అమ్మడికి ఢోకా లేదు. కొత్త భామలెవరు కూడా కాంపిటీషన్ లో లేకపోవడం సమంత లాంటి నటి కూడా హిందీ కి వెళ్లిపోవడంతో? టాలీవుడ్ లో ఇంకాస్త స్పేస్ ఏర్పడింది.
సమంత అవకాశాలు కీర్తి అందుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. మాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ అక్కడంత సీరియస్ పనిచేయడం లేదు. భారీ స్పాన్ ఉన్న చిత్రాలపైనే దృష్టి పెట్టి పని చేస్తోంది. అలాగే అమ్మడు గత ఏడాది వివాహంతో ధాంపత్య జీవితంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీ తట్టెల్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఇతడు బిజినెస్ రంగంలో ఉన్నాడు. సినిమాతో ఎంత మాత్రం సంబంధం లేదు. కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం మంచి పరిచయలున్నాయి. బాలీవుడ్ లో కూడా చాలా కాంటాక్స్ట్ ఉన్నాయని చెబుతారు.
దీంతో ఆ పరిచయాలతో హబ్బీని కీర్తి సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా? అంటే అవుననే తెలుస్తోంది. అయితే ఆంటోనీ సినిమాలంటే మాత్రం తనకు దూరంగా పారిపోతాడని తెలిపింది. సినిమాలు చూడటం వరకూ ఒకే గానీ..వాటిలో నటించడం అంటే ఇబ్బందిగా ఫీలవుతాడని అంటోంది. భవిష్యత్ లో భర్తతో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు గానూ కీర్తి సురేష్ అలా బధులిచ్చింది. `రివాల్వార్ రీటా` చిత్రాన్ని భర్తతో కలిసి చూసానని తెలిపారు.
నిజానికి కీర్తి కెరీర్ ఇలా టర్నింగ్ తీసుకుంటుందని ఊహించలేదు. `మహానటి` తర్వాత స్టార్ లీగ్ కాయమనుకుంటే? అమ్మడు వచ్చిన గొప్ప అవకాశాలు ఎన్నో వదులుకుంది. సావిత్రి మత్తులో నుంచి బయట డటానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో గ్లామర్ పాత్రల్లో నటించాలని ఎన్నో అవకాశాలు వచ్చినా? నో చెప్పింది. దీంతో దర్శక, నిర్మాతలు అమ్మడిని దూరం పెట్టారు. అటుపై కొన్ని నెలలకే వాస్తవాన్ని గ్రహించింది. అలా ఉంటే అవకాశాలు రావని గుర్తించిన అమ్మడు వెంటనే ఆలోచనా విధానం మార్చింది. గ్లామర్ పాత్రలకు ఒకే చెప్పడం మొదలు పెట్టింది. దీంతో పాటు వచ్చిన ఏ అవకాశానికి నో చెప్పలేదు. ఈ క్రమంలోనే మనటిగా మళ్లీ బిజీ అయింది.
