తెల్ల తోలు ఉంటేనే వాళ్లు పిలుస్తారా?
`బిగ్ బాస్` ఫేం విన్నర్ కీర్తి భట్ సుపరిచితమే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చింది.
By: Srikanth Kontham | 16 Aug 2025 9:00 PM IST`బిగ్ బాస్` ఫేం విన్నర్ కీర్తి భట్ సుపరిచితమే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చింది. తొలుత సీరియల్ నటిగా, అటుపై బిగ్ బాస్ విన్నర్ గా తెలుగింట ఫేమస్ అయింది. అనతరం అనాధ బాలికగా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇండస్ట్రీలో చాలా మందిలా తాను కూడా కష్టాలు ఎదురీది ఎదిగిన నటే. తాజాగా టీవీ ఇండస్ట్రీ సహా బిగ్ బాస్ లో తాను ఎదుర్కున్న అనుభవాలను గుర్తు చేసుకుంది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన అనంతరం నిర్వాహకులు ఓ అవార్డు కార్యక్రమం నిర్వహించారు.
కానీ ఆ జాబితాలో తనకు స్థానం కల్పించలేదంది. టాప్ 3 లో తన తో పాటు రోహిత్ ఉన్నా ఇద్దర్నీ పక్కన బెట్టి ఆ తర్వాత స్థానం సహా టాప్ 10 లో ఉన్న వాళ్లను ఆ కార్యక్రమానికి అహ్వానం పంపించారు. తమకి అహ్వానం వస్తుందని ఆశించినా? నిర్వాహకుల నుంచి ఎలాంటి పిలుపు రాలేదంది. అప్పుడే తనకో మూడు విషయాలు అర్దమైనట్లు తెలిపింది. టీవీ షోల్లో నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ అందించాలి. మోడ్రన్ గా కనిపించాలి. శరీర రంగు కూడా తెల్లగా ఉండాలి. నిర్వాహకులకు అనుకూలంగా ఉండాలి.
ఈ మూడు ఉంటే మిగతా ఎలాంటి అర్హతలున్నా లేకపోయినా? పర్వాలేదు. ఇవి నాలో లేవు. అందుకే నన్ను అవార్డు కార్యక్రమానికి పిలవలేదని అర్దమైందని తెలిపింది. `ఇన్ని లెక్కలేసుకుని ముందుకెళ్తోన్న ఇండస్ట్రీలో పని చేయాలా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలని పిస్తుంది. కానీ నచ్చిన రంగం కావడంతో వదిలి వెళ్లలేకపోతున్నా. నాలాగే చాలా మంది నటీమణులు ఇలాంటి అనుభవాన్ని చూసే ఉంటారు. ట్యాలెంట్ ఉన్నా? ఇక్కడ అందరికీ గౌరవమర్యాదలు దక్కవని అసహనం వ్యక్తం చేసింది.
జబర్దస్త్ ఫేం, మరో సీరియల్ నటి సౌమ్యారావు కూడా టీవీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులున్నాయనే అంశాన్ని లేవనెత్తిన కొన్ని గంటల్లోనే కీర్తి భట్ కూడా తెరపైకి రావడం ఆసక్తికరం. కీర్తి భట్ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్న నటిగా గతంలో తెలిపింది. నటిగా ఎదిగే వరకూ ఇక్కడ ఆ రకమైన వేధింపులు ఏదో రూపంలో ఎదురవుతాయని అభిప్రాయపడింది.
