'వారణాసి' కీరవాణి హింట్స్ తో రాజమౌళికి తిప్పలు..!
రాజమౌళి ప్రతి సినిమాకు అన్నయ్య కీరవాణి కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది మాటల్లో కాదు మ్యూజిక్ తో తెలుస్తుంది.
By: Ramesh Boddu | 22 Nov 2025 12:30 PM ISTవారణాసి సినిమా గురించి కీరవాణి ఇస్తున్న లీక్స్ పై డైరెక్టర్ రాజమౌళి షాక్ అవ్వక తప్పట్లేదు. రాజమౌళి ప్రతి సినిమాకు అన్నయ్య కీరవాణి కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది మాటల్లో కాదు మ్యూజిక్ తో తెలుస్తుంది. రాజమౌళి ఎలివేషన్ కి కీరవాణి మ్యూజిక్ తోనే ఆ సీన్ కి భారీతనం వస్తుంది. అందుకే ఈ కాంబో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనేస్తాం. ఐతే రాజమౌళి లేటెస్ట్ సినిమా వారణాసి సినిమాకు కూడా కీరవాణి ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ రిలీజైన సంచారీ సాంగ్ తో పాటు కుంభ ఎంట్రీ సాంగ్ కూడా సర్ ప్రైజ్ చేసింది.
వారణాసి ప్రమోషన్స్ లో తన ప్లాన్ ప్రకారం..
ఐతే లేటెస్ట్ గా సినిమా నుంచి మరో ఎక్స్ క్లూజివ్ విషయాన్ని వెల్లడించాడు కీరవాణి. వారణాసి లో ఆరు సాంగ్స్ ఉంటాయని.. అవు అద్భుతంగా వచ్చాయని అన్నారు. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో కీరవాణి ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు మన పనికి మనం పర్ఫెక్ట్ చేస్తే ఎలాంటి ఆందోళన ఉండదు. అంతేకాదు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారణాసి మ్యూజిక్ విషయంలో తాను అలానే ఉన్నానని అన్నారు.
రాజమౌళి ఏమో వారణాసి ప్రమోషన్స్ లో తన ప్లాన్ ప్రకారం జరగాలని అనుకుంటుంటే కీరవాణి మైక్ దొరికితే చాలు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ తమ్ముడికి షాక్ ఇస్తున్నాడు. వారణాసి గ్లింప్స్ ఈవెంట్ లో కూడా సినిమా రిలీజ్ ఎప్పుడన్నది లీక్ చేశాడు కీరవాణి. 2027 సమ్మర్ లో రిలీజ్ ఉంటుందని చెప్పాడు. అది విన్న రాజమౌళి కూడా కాస్త షాక్ అయ్యాడనే చెప్పాలి.
ప్రతి ఒక్కరు ఏం మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలి అన్నది..
ఇక ఇప్పుడేమో వారణాసి మ్యూజిక్ అప్డేట్ తో మరోసారి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు కీరవాణి. ఐతే రాజమౌళి సినిమా అంటే మైక్ అందుకున్న ప్రతి ఒక్కరు ఏం మాట్లాడాలి.. ఎంత మాట్లాడాలి అన్నది ముందే స్క్రిప్ట్ ఉంటుందని. రాజమౌళి రాసి ఇచ్చింది తప్ప మరో అక్షరం కూడా ఎక్కువ మాట్లాడరన్న టాక్ ఉంది. మరి జక్కన్న అన్నయ్య కీరవాణికి అలాంటి కండీషన్స్ ఏమి పెట్టలేదా ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు లీడ్ రోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాను అనుకున్న టైం కు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. ఈ సినిమాకు కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పని బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్య రిలీజైన గ్లింప్స్ కోసమే రాజమౌళి, వి.ఎఫ్.ఎక్స్ టీం ఏడాది పాటు పనిచేశారని తెలిసిందే.
