ఇండిపెండెంట్ మ్యూజిక్‌తోనూ అద్భుతాలు!
డిజిటల్ యుగంలో సక్సెస్ అవ్వడానికి ట్యాలెంట్ ఉంటే చాలు. ప్రత్యేకించి సినిమా రంగంలో స్థిరపడాలనుకునే వారికి డిజిటల్ మాధ్యమాలు ఎంతగా దోహదపడుతున్నాయో తెలిసిందే
By: Srikanth Kontham | 16 May 2026 4:00 AM ISTడిజిటల్ యుగంలో సక్సెస్ అవ్వడానికి ట్యాలెంట్ ఉంటే చాలు. ప్రత్యేకించి సినిమా రంగంలో స్థిరపడాలనుకునే వారికి డిజిటల్ మాధ్యమాలు ఎంతగా దోహదపడుతున్నాయో తెలిసిందే. ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఒక్క వీడియో చేస్తే చాలు.. అది చేరాల్సిన వారికి చేరితో ప్రతిభను గుర్తించి పిలిచి మరీ అవకాశాలిస్తోన్న రోజులివి.ఈ మధ్య కాలంలో అలా వెలుగులోకి వస్తోన్న సంగీత దర్శకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.ఇండిపెండెంట్ సంగీతానికి కూడా శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ కయాన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ సాధిస్తున్న పురోగతి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
స్వతంత్ర సంగీతానికి అద్భుతమైన సమయం నడుస్తోంది. గతంలో సినిమా పాటల నీడలో మరుగున పడిపోయిన ఇండిపెండెంట్ కళాకారులకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోందన్నారు. `మనం ఇప్పుడు గ్లోబల్ విలేజ్‌లో ఉన్నాం. ఇక్కడ సంగీతం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఆధునిక బీట్స్ కలయికతో వస్తోన్న పాటలను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నారన్నారు. ఇలాంటి ఎలాంటి ఒత్తిళ్లకు గురవుతున్నారో కూడా వివరించారు. సింగర్‌ను , మ్యుజీషియన్‌ను ఒకే రకమైన శైలికి పరిమితం చేయాలని చూడటం సరికాదని కయాన్ అన్నారు.
తాను ఎప్పుడూ రొటీన్ పద్ధతులకు లొంగిపోలేదని నచ్చిన రీతిలో ప్రయోగాలు చేయడానికే ఇష్టపడతానన్నారు. ఇండస్ట్రీ నిర్దేశించిన ఫార్ములాలను పాటించకుండా స్వంత అభిరుచితో చేసినప్పుడే నిజమైన కళాఖండాలు పుడతాయని కయాన్ వెల్లడించారు. కానీ స్వతంత్ర కళాకారిణిగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదన్నారు. ఇందులో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ప్రయాణం చేయాల్సి ఉంటుందుందన్నారు. కానీ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే? ఎలాంటి ఒత్తిళ్లు అయినా దాటొచ్చు.
ఒక్క సక్సెస్ ఎంతో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా శ్రోతలు కూడా కొత్త తరహా సంగీతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇది తమలాంటి యంగ్ మ్యుజీషియన్లకు పెద్ద వరమని కయాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీయ స్వతంత్ర సంగీతం ప్రత్యేక అస్తిత్వాన్ని సృష్టించుకుందని అంతా నమ్ముతున్నారు. వెస్ట్రన్ మ్యూజిక్‌ను అనుకరణతో పాటు, మూలాలను మర్చిపోకుండా కొత్తదనాన్ని జోడించడం వల్లే ఇండి మ్యూజిక్ ముమెంటం అందుకుందన్నారు.
భవిష్యత్తులో ఈ రంగం మరిన్ని శిఖరాలను అధిరో హిస్తుందని సినిమా సంగీతంతో సమానంగా ఇండి మ్యూజిక్ కూడా రాజ్యమేలుతుందని అభిప్రాయపడ్డారు. కయాన్ వంటి కళాకారులు చూపిస్తున్న తెగువ , సృజనాత్మకత భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. పరిమితులకు తలొగ్గకుండా? తన గాత్రాన్ని ప్రపంచానికి వినిపిస్తున్న ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇండిపెండెంట్ మ్యూజిక్ ట్రెండ్ మాత్రమే కాదు. అది భారతీయ కళాకారుల స్వేచ్ఛకు చిహ్నమని కయాన్ మాటలు నిరూపిస్తున్నాయి
